TG Floods: రేపు తెలంగాణకు రానున్న కేంద్ర బృందం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, నష్టం అంచనా వేయనున్న బృందాలు-the central team will come to telangana tomorrow the teams will visit the flood affected areas and assess the damage ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Floods: రేపు తెలంగాణకు రానున్న కేంద్ర బృందం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, నష్టం అంచనా వేయనున్న బృందాలు

TG Floods: రేపు తెలంగాణకు రానున్న కేంద్ర బృందం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన, నష్టం అంచనా వేయనున్న బృందాలు

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 10, 2024 07:56 AM IST

TG Floods: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలో నష్టపోయి ప్రాంతాల్లో సెప్టెంబర్ 11న కేంద్ర ప్రాంతాలు పర్యటించనున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనా వేయనున్నాయి. కేంద్ర బృందాలు బాధితులు, పౌరసమాజం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం అవుతారు.

తెలంగాణలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రానున్న కేంద్ర బృందాలు
తెలంగాణలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రానున్న కేంద్ర బృందాలు

TG Floods: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలో నష్టపోయి ప్రాంతాల్లో సెప్టెంబర్ 11న కేంద్ర ప్రాంతాలు పర్యటించనున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనా వేయనున్నాయి. కేంద్ర బృందాలు బాధితులు, పౌరసమాజం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం అవుతారు.

ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న హోంశాఖ జాయింట్ సెక్రటరీ కేపీ సింగ్ తో ఫోన్లో మాట్లాడి వివరాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు.

తెలంగాణలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని పంపనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్&కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 గురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం 11 సెప్టెంబర్ న తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి.

ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా.. ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులున్నారు.

కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతోపాటుగా పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, అధికారులతో చర్చిస్తుంది.

ఈ సందర్భంగా.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడి.. ఆదివారం నాటి తన ఖమ్మం పర్యటనలో తెలుసుకున్న అంశాలను, బాధితుల ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు.

Whats_app_banner