TGPSC Group 3 Updates : గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ఇవాళ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి..!-tgpsc group 3 hall ticket will be released today download 2024 link at new tspsc gov in website ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 3 Updates : గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ఇవాళ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి..!

TGPSC Group 3 Updates : గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ - ఇవాళ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 10, 2024 05:23 AM IST

TGPSC Group 3 Hall Tickets 2024 : ఇవాళ తెలంగాణ గ్రూప్ 3 హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.

తెలంగాణ గ్రూప్ 3 హాల్ టికెట్లు
తెలంగాణ గ్రూప్ 3 హాల్ టికెట్లు

తెలంగాణ గ్రూప్ 3 రాత పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవాళ వెబ్ సైట్ లో అందుబాటులోకి వస్తాయని టీజీపీఎస్సీ తెలిపింది. ఇందుకు సంంబంధించిన రాత పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో జరగనున్నాయి. 17వ తేదీన ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ -2 ఉంటాయని వివరించింది. 18వ తేదీన చివరి పేపర్ పరీక్ష జరగనుంది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది.

టైమింగ్స్...

నవంబర్ 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌లో మొదటి పేపర్ ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 05:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. 18వ తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది.

గ్రూప్ 3 హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి...

  1. Step 1 : అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ పై క్లిక్ చేయాలి.
  2. Step 2 : హోమ్ పేజీలోకనిపించే గ్రూప్-3 డౌన్ లోడ్ హాల్ టికెట్లు ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. Step 3 : ఆ తర్వాత పేజీలో టీజీపీఎస్సీ OTR ఐడీ, పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చా వివరాలు నమోదు చేయాలి.
  4. Step 4 : సబ్మిట్ బటన్ పై నొక్కితే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. Step 5 : ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.

మొత్తం 3 పేపర్లు...

  • తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలో మొత్తంగా 3 పేపర్లు ఉంటాయి.
  • ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు.
  • ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది.
  • ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
  • గ్రూప్ 3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.

ఏ పేపర్ లో ఏముంటందంటే..?

గ్రూప్ 3లోని మొదటి పేపర్ లో జనరల్ నాల్జెడ్ కి సంబంధించి ఉంటుంది. ఇక పేపర్‌-2లో మొత్తం 3 అంశాలు ఉండగా.. ప్రతి అంశంపై 50 ప్రశ్నలు.. 50 మార్కులు ఉంటాయి. ఇదే పేపర్‌లో భారత రాజ్యాంగం అంశానికి 50 మార్కులు, భారత చరిత్రకు మరో 50 మార్కులు ఇచ్చారు. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశానికి 50 మార్కులు ఉంటాయి. పేపర్‌-3లో మూడు అంశాలుండగా.. ఒక్కో అంశానికి 50 మార్కులున్నాయి. వీటిలో భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో మార్పులు వంటి అంశాలున్నాయి.

నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం కొలువుల సంఖ్య 1,388 భర్తీ చేయనున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా సెంటర్లను ఖరారు చేశారు. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం