UPSC Recruitment 2024: అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్
UPSC Recruitment 2024: అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య, విద్యార్హతలు మొదలైన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి. ఆసక్త, అర్హత ఉన్న అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
UPSC Recruitment 2024: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 27 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నవంబర్ 28. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.
అర్హతలు
ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కంప్యూటర్ అప్లికేషన్స్ లో లేదా కంప్యూటర్ సైన్స్ లో లేదా కంప్యూటర్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. లేదా
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లో లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ సర్టిఫికెట్ ను కలిగి ఉండలి. లేదా
- కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో గుర్తింపు పొందిన యూనివర్సటీ లేదా విద్యాసంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
- ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయోపరిమితి యూఆర్/ఈడబ్ల్యూఎస్ లకు 30 ఏళ్లు, ఓబీసీలకు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 35 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ఫీజు
మహిళా/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతరులు రూ. 25 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఫీజును నగదు రూపంలో లేదా ఏదైనా బ్యాంకు నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించి లేదా వీసా / మాస్టర్ / రూపే / క్రెడిట్ / డెబిట్ కార్డు / యుపిఐ చెల్లింపు ఉపయోగించి ఎస్బిఐ యొక్క ఏదైనా శాఖ ద్వారా చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించడం కుదరదు. లేదా మరే ఇతర పరీక్ష లేదా ఎంపిక కోసం ఫీజును రిజర్వ్ లో ఉంచడానికి కుదరదు.
ఎలా అప్లై చేయాలి
- యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in సందర్శించండి.
- రిక్రూట్మెంట్ లింక్ కింద హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఓఆర్ఏ లింక్ పై క్లిక్ చేయండి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులకు అసిస్టెంట్ ప్రోగ్రామర్ అప్లికేషన్ లింక్ కనిపిస్తుంది.
- ఆ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
- మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూపీఎస్సీ (UPSC) అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.