TG ICET Counselling : ‘ఐసెట్’ ప్రవేశాలకు ఫుల్ డిమాండ్! ఈనెల 20 నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్, ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి-tg icet 2024 final phase counselling registration to start from 20 september 2024 key dates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Icet Counselling : ‘ఐసెట్’ ప్రవేశాలకు ఫుల్ డిమాండ్! ఈనెల 20 నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్, ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి

TG ICET Counselling : ‘ఐసెట్’ ప్రవేశాలకు ఫుల్ డిమాండ్! ఈనెల 20 నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్, ఈ తేదీలను గుర్తుపెట్టుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 18, 2024 03:50 PM IST

TG ICET Counselling 2024 Updates : ఈనెల 20 నుంచి టీజీ ఐసెట్ - 2024 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 25వ తేదీన సీట్లు కేటాయించనున్నారు. ఎంట్రెన్స్ పరీక్షలో పాసైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ 2024
తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ 2024

తెలంగాణ ఐసెట్ - 2024 ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తికాగా… సెప్టెంబర్ 20 నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 20, 21 తేదీల్లో రిజిస్ట్రేషన్ తో పాటు ఆన్ లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు  21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. 22వ తేదీన ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 25వ తేదీలోపు సీట్లను కేటాయిస్తారు. 25, 27 తేదీల్లో నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 25 - 28 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. సెప్టెంబర్ 27వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలవుతాయి.

టీజీ ఐసెట్ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే ICET Results 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు Registration Number, పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.
  • అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.

పుల్ డిమాండ్…!

ఇటీవలే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగిసింది. ఎంసీఏ కోర్సుల్లో 86 శాతం, ఎంబీఏలో 87.5 శాతం సీట్లు భ‌ర్తీ అయ్యాయి. ఈ ఏడాది మొత్తం 34,748 సీట్లు ఉండ‌గా… 30,300 సీట్లు ఫస్ట్ ఫేజ్ లోనే భర్తీ అయ్యాయి. ఇంకా 4,448 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. తొలి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు రిపోర్టింగ్ చేసే గడువు కూడా సెప్టెంబర్ 17వ తేదీతో పూర్తి అయింది.  ఈ ఏడాది ఐసెట్ ప్రవేశాలకు బాగా డిమాండ్ పెరిగిందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

ఇక ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ లో కూడా సీట్ల కోసం అభ్యర్థులు భారీగానే పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. మొదటి విడతలోనే దాదాపు 80 శాతానికి పైగా సీట్లు భర్తీ కావటంతో… ఫైనల్ ఫేజ్ లో తక్కువ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ విడత కూడా పూర్తి అయితే…. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ ఐసెట్‌ పరీక్ష కోసం 86156 మంది దరఖాస్తు చేసుకున్నారు. 77942 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది.జూన్‌ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఐసెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది కాకతీయ వర్శిటీ టీజీ ఐసెట్ - 2024 పరీక్షలను నిర్వహించింది.  కౌన్సెలింగ్ లో భాగంగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లతో పాటు ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కోసం https://icet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.