TG DSC Results 2024 : జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ పై కసరత్తు...! త్వరలోనే ‘డీఎస్సీ’ తుది ఫలితాలు-tg dsc results 2024 likely to be declared soon latest updates read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dsc Results 2024 : జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ పై కసరత్తు...! త్వరలోనే ‘డీఎస్సీ’ తుది ఫలితాలు

TG DSC Results 2024 : జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ పై కసరత్తు...! త్వరలోనే ‘డీఎస్సీ’ తుది ఫలితాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 07, 2024 08:21 AM IST

TG DSC Result 2024 Updates : డీఎస్సీ ఫలితాలపై తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. శుక్రవారం ఫైనల్ కీ ని ప్రకటించటంతో త్వరలోనే మెరిట్ లిస్ట్(జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌) ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత తుది ఫలితాలను వెల్లడించనున్నారు.

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు

త్వరలోనే తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలకానున్నాయి. ఆలస్యం కాకుండా పరీక్షలు పూర్తి అయిన కొద్దిరోజుల్లోనే ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిపై వచ్చిన అభ్యంతరాలను కూడా పరిశీలించింది తాజాగా ఫైనల్ కీని కూడా ప్రకటించింది.

త్వరలోనే జనరల్ ర్యాంకుల జాబితా…!

ఫైనల్ కీ కూడా రావటంతో మెరిట్ లిస్ట్ పై విద్యాశాఖ ఫోకస్ పెట్టనుంది. ఆ దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. డీఎస్సీ పరీక్షలో వచ్చిన మార్కులతో పాటు టెట్ వెయిటేజీని కలుపుతారు. రెండింటిని కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకుల జాబితాను ప్రకటిస్తారు.

జిల్లాల వారీగా జనరల్ ర్యాంకులను ప్రకటించిన తర్వాత…. ధ్రువపత్రాల పరిశీలన ఉండనుంది. ఇందుకోసం ఒక్క పోస్టుకు ముగుగు చొప్పున ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి తర్వాత…పోస్టుకు ఒకరికి ఎంపిక చేస్తారు. వారికి నియామక ఉత్తర్వులను అందజేస్తారు. అయితే మొత్తం ప్రక్రియల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కీలకంగా ఉంటుంది. ఇందులోని ర్యాంకులను బట్టి అభ్యర్థులు ఓ అంచనాకు రావొచ్చు. ఈ జాబితాను ఈ వారం రోజుల వ్యవధిలోనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

వెబ్ సైట్ లో ఫైనల్ కీ:

తెలంగాణ డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ లు శుక్రవారం సాయంత్రం తర్వాత అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://tgdsc.aptonline.in/tgdsc/FinalKey లింక్ పై క్లిక్ చేసి ఫైనల్ కీని పొందవచ్చు.

డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లపై భారీగా అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా 28 వేలకుపైగా అభ్యంతరాలు అందాయి. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా… ఈసారి జరిగిన పరీక్షపై అత్యధిక స్థాయిలో అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిశీలించిన విద్యాశాఖ…. శుక్రవారం ఫైనల్ కీని ప్రకటించింది. ఆగస్టు 13న రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీని విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 20వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. దాదాపు 10 రోజులకుపైగా అభ్యంతరాల పరిశీలను చేపట్టింది. తుది కీలో మొత్తం అన్ని విడతల్లో(సబ్జెక్టులు వారీగా) కలిపి 109 ప్రశ్నలకు జవాబులను మార్చారు.

డీఎస్సీ కీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • డీఎస్సీ రిక్రూట్ మెంట్ - 2024 ఆప్షన్ పై నొక్కాలి. కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ కనిపించే హోం పేజీలో ఫైనల్ కీ అనే ఆప్షన్ ఉంటుంది.
  • దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ సబ్జెక్టుల వారీగా డిస్ ప్లే అవుతుంది.
  • మీరు రాసిన పరీక్ష పేపర్ పై క్లిక్ చేస్తే కీ ఓపెన్ అవుతుంది.
  • డౌన్లోడ్ లేదా ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా చూస్తే…. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.