India Post GDS merit list: ‘గ్రామీణ్ డాక్ సేవక్’ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన ఇండియా పోస్ట్; ఆ రెండు రాష్ట్రాల్లో వాయిదా-india post gds merit list out for all circles except haryana and j and k check now ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Post Gds Merit List: ‘గ్రామీణ్ డాక్ సేవక్’ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన ఇండియా పోస్ట్; ఆ రెండు రాష్ట్రాల్లో వాయిదా

India Post GDS merit list: ‘గ్రామీణ్ డాక్ సేవక్’ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన ఇండియా పోస్ట్; ఆ రెండు రాష్ట్రాల్లో వాయిదా

HT Telugu Desk HT Telugu
Aug 22, 2024 10:15 PM IST

‘గ్రామీణ్ డాక్ సేవక్’ మెరిట్ లిస్ట్ నుగురువారం ఇండియా పోస్ట్ విడుదల చేసింది. జీడీఎస్ రిక్రూట్మెంట్ 2024కు హాజరైన అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్ సైట్ indiapostgdsonline.gov.in లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

 ‘గ్రామీణ్ డాక్ సేవక్’ మెరిట్ లిస్ట్ విడుదల
‘గ్రామీణ్ డాక్ సేవక్’ మెరిట్ లిస్ట్ విడుదల (Getty Images/iStockphoto)

హర్యానా, జమ్మూ కాశ్మీర్ మినహా మిగిలిన అన్ని సర్కిళ్లకు గ్రామీణ్ డాక్ సేవక్ (జిడిఎస్), 2024 మొదటి మెరిట్ లిస్ట్ ను ఇండియా పోస్ట్ ప్రచురించింది. ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2024కు హాజరైన అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్ సైట్ indiapostgdsonline.gov.in లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

రెండు సర్కిళ్లు మినహా

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన హరియాణా, జమ్మూకశ్మీర్ సర్కిళ్లను మినహాయించి మిగతా అన్ని సర్కిళ్ల జీడీఎస్ మెరిట్ లిస్ట్ ను ఇండియా పోస్ట్ ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారిక వెబ్ సైట్ indiapostgdsonline.gov.in ద్వారా వెల్లడించింది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటిస్తున్నట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా 44 వేల పోస్ట్ లు..

దేశవ్యాప్తంగా 23 పోస్టల్ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్నారు. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ తేదీలకు సంబంధించిన మరిన్ని వివరాలను రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా, ఈమెయిల్ ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తారు.

ఇలా చెక్ చేసుకోండి..

  • ఇండియా పోస్ట్ గ్రామీణ్ డాక్ సేవక్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్ సైట్ indiapostgdsonline.gov.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఇండియా పోస్ట్ (india post) జిడిఎస్ మెరిట్ లిస్ట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ రోల్ నంబర్ ఆధారంగా జాబితాను చెక్ చేయవచ్చు.
  • అనంతరం, పేజీని డౌన్ లోడ్ చేసుకోండి. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.