India Post GDS Recruitment : 44,228 ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి రోజు.. 10వ తరగతి పాసైతే చాలు!-india post gds recruitment 2024 last date today to apply for 44228 posts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Post Gds Recruitment : 44,228 ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి రోజు.. 10వ తరగతి పాసైతే చాలు!

India Post GDS Recruitment : 44,228 ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి రోజు.. 10వ తరగతి పాసైతే చాలు!

Sharath Chitturi HT Telugu
Aug 05, 2024 08:54 AM IST

india post gds recruitment 2024 last date : ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2024 రిజిస్ట్రేషన్ నేటితో ముగియనుంది. దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి రోజు
ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి రోజు

ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి కీలక​ అప్డేట్​! ఇండియా పోస్ట్ 2024 ఆగస్టు 5న గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించనుంది. ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు indiapostgdsonline.gov.in అధికారిక వెబ్​సైట్​లో డైరెక్ట్ లింక్​ని పొందొచ్చు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 జులై 15న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక నేటితో అప్లికేషన్​ స్వీకరణ ముగుస్తుంది. కరెక్షన్ విండో ఆగస్టు 6న ప్రారంభమై ఆగస్టు 8, 2024న ముగుస్తుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలోని 44228 పోస్టులను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత- ఇతర వివరాలు..

జీడీఎస్ కోసం విద్యార్హత 10వ తరగతి సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ భారత ప్రభుత్వం / రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాలచే ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల విద్యా మండలి నిర్వహించే గణితం, ఆంగ్లంలో ఉత్తీర్ణత మార్కులతో పాస్​ అవ్వాలి.

అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠంగా 40 ఏళ్లకు మించకూడదు. అయితే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో కాస్త సడలింపు ఇచ్చారు.

ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ డైరెక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2024 : ఆన్​లైన్​లో ఇలా దరఖాస్తు చేసుకోండి..

ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్​కు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింద చెప్పిన ప్రాసెస్​ని అనుసరించవచ్చు.

  • indiapostgdsonline.gov.in వద్ద ఇండియా పోస్ట్ అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్​పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్​పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
  • అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • సబ్మిట్​ బటన్​పై క్లిక్ చేసి పేజీని డౌన్​లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసి పెట్టుకోండి.

జీడీఎస్ రిక్రూట్మెంట్ దరఖాస్తు ఫీజు రూ.100. మహిళా దరఖాస్తుదారులు, ఎస్సీ, ఎస్టీ దరఖాస్తుదారులు, దివ్యాంగులు, ట్రాన్స్ ఉమెన్ దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది. దరఖాస్తు ఫీజును ఆన్​లైన్ ద్వారానే చెల్లించాలని గుర్తుపెట్టుకోవాలి.

అధికారిక నోటిఫికేషన్​ ప్రకారం.. గుర్తింపు పొందిన బోర్డుల 10 వ తరగతి సెకండరీ స్కూల్ పరీక్షలో సాధించిన మార్కులు / గ్రేడ్లు / పాయింట్లను మార్కులుగా మార్చడం ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్​సైట్​ని చూడవచ్చు.

ఐబీపీఎస్​ క్లర్క్​ అడ్మిట్​ కార్డు విడుదల..

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో గ్రూప్ బీ ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఇన్​స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విడుదల చేసింది. అభ్యర్థులు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులను ఇన్​స్టిట్యూట్ వెబ్సైట్ ibps.in నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చను. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం