TG DSC Final Key 2024 : తెలంగాణ డీఎస్సీ ఫైనల్ 'కీ' విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి-tg dsc final key 2024 out at httpstgdscaptonlineintgdscfinalkey ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dsc Final Key 2024 : తెలంగాణ డీఎస్సీ ఫైనల్ 'కీ' విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TG DSC Final Key 2024 : తెలంగాణ డీఎస్సీ ఫైనల్ 'కీ' విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 06, 2024 06:04 PM IST

TG DSC Results 2024 Updates : తెలంగాణ డీఎస్సీ -2024 పరీక్షల ఫైనల్ కీ వచ్చేసింది. https://tgdsc.aptonline.in/tgdsc/FinalKey లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అతి తొందర్లోనే జిల్లాల వారీగా మెరిట్ జాబితాను కూడా ప్రకటించనున్నారు.

తెలంగాణ డీఎస్సీ ఫైనల్ 'కీ' విడుదల
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ 'కీ' విడుదల

తెలంగాణ డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీ లు వచ్చేశాయి. అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://tgdsc.aptonline.in/tgdsc/FinalKey లింక్ పై క్లిక్ చేసి ఫైనల్ కీని పొందవచ్చు. త్వరలోనే తుది ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.

డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లపై భారీగా అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా 28 వేలకుపైగా అభ్యంతరాలు అందాయి. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా… ఈసారి జరిగిన పరీక్షపై అత్యధిక స్థాయిలో అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిశీలించిన విద్యాశాఖ…. శుక్రవారం ఫైనల్ కీని ప్రకటించింది.

ఆగస్టు 13న రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీని విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 20వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. దాదాపు 10 రోజులకుపైగా అభ్యంతరాల పరిశీలను చేపట్టింది.

త్వరలోనే ఫలితాలు…!

ఫైనల్ కీ విడుదల కావటంతో త్వరలోనే జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడి చేయనున్నారు. మెరిట్‌ జాబితా జారీ విడుదల తర్వాత ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలన్న ఉద్దేశ్యంతో సర్కార్ ఉంది. ఈ విషయంలో ఓ డెడ్ లైన్ కూడా పెట్టుకుని పని చేస్తోంది.

ఫలితాల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి గురువారం కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షల ఫలితాలు వారం రోజుల్లో విడుదలవుతాయని చెప్పుకొచ్చారు. దీంతో అతి తొందర్లోనే డీఎస్సీ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. 

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా చూస్తే…. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.

డీఎస్సీ కీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/ISMS/   వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • డీఎస్సీ రిక్రూట్ మెంట్ - 2024 ఆప్షన్ పై నొక్కాలి. కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ కనిపించే హోం పేజీలో ఫైనల్ కీ అనే ఆప్షన్ ఉంటుంది.
  • దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ సబ్జెక్టుల వారీగా డిస్ ప్లే అవుతుంది.
  • మీరు రాసిన పరీక్ష పేపర్ పై క్లిక్ చేస్తే కీ ఓపెన్ అవుతుంది.
  • డౌన్లోడ్ లేదా ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.