AP Govt: మున్నూరు కాపులకు బీసీ - డీ ధ్రువపత్రాలు
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మున్నూరు కాపు కులస్తులకు బీసీ - డీ కింద సర్టిఫికెట్లు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది.
Cast certificate for munuru kapu under BC -D: మున్నూరు కాపు కులస్తులకు ధ్రువపత్రాల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని బీసీ-డీ కింద గుర్తిస్తూ... సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు చెందిన ఏడు మండలాలు ఏపీలో విలీనం అయ్యాయి. ఈ క్రమంలో ఈ ఏడు మండలాల్లోని మున్నూరు కాపులు కూడా ఏపీలో కలిసిపోయారు. అయితే వీరిని తెలంగాణలో బీసీ - డీ కింద గుర్తిస్తున్నారు. అయితే తమను ఏపీలో కూడా బీసీ - డీ కింద గుర్తించాలంటూ నాటి నుంచి సంబంధిత కులాలు వాళ్లు విజ్ఞప్తి చేశారు.
సీఎం దృష్టికి సమస్య...
గోదావరి వరద నేపథ్యంలో... ప్రభావిత జిల్లాల్లో సీఎం జగన్మోన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా విలీన మండలాల్లోని మున్నూరు కాపులు... సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర బీసీ కమిషన్, ఆయా జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదకల ఆధారంగా... ప్రభుత్వం తగిన ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా మున్నూరు కాపులకు బీసీ - డీ కింద కుల ధ్రువీకరణ పత్రాలు రానున్నాయి.