Telangana Tourism Shirdi Ellora Tour 2024: అతి తక్కువ ధరలోనే మరో సూపర్ ప్యాకేజీని తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం(Telangana Tourism). కేవలం 3 వేల ధరలోనే షిర్డీ, ఎల్లోరా(Shirdi Ellora Tour) ట్రిప్ ను ప్రకటించింది. మొత్తం 4 రోజుల పాటు టూర్ కొనసాగుతుంది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది. బస్సు జర్నీ చేయాల్సి ఉంటుంది. షిర్డీ సాయి బాబా(Shirdi) దర్శనంతో పాటు మరిన్ని ప్రాంతాలను చూడాల్సి ఉంటుంది.
మరోవైపు తక్కువ ధరలోనే Pancharamam Temples Tour ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. ఇందులో భాగంగా… ఏపీలోని ప్రముఖ ఐదు పంచారామ క్షేత్రాలను చూపించనుంది. బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ప్రతి ఆదివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.