Telangana Assembly : ముగిసిన సమావేశాలు - తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Telangana Assembly Updates: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఈ మేరకు స్పీకర్ ప్రకటన చేశారు. మొత్తం ఆరు రోజుల పాటు సభ జరిగినట్లు ప్రకటించారు.
Telangana Assembly Adjourned: తెలంగాణ శాసనసభా సమావేశాలు ముగిశాయి. సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఆరు రోజుల పాటు సభ నిర్వహించినట్లు వెల్లడించారు. మొత్తం పని గంటలు 26 గంటల 36 నిమిషాలుగా పేర్కొన్నారు. సభలో 19 మంది సభ్యులు మాట్లాడినట్లు చెప్పారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో… డిసెంబర్ 9వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెలవులు పోనూ సమావేశాలు ఆరు రోజుల పాటు సాగాయి. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికయ్యారు. నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణం స్వీకారం జరిగింది. ఆ తర్వాత స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయన ఎన్నిక అనంతరం…. అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. మొత్తం ఆరు రోజులు... 26 గంటల 33 నిమిషాల పాటు జరిగాయి. ఈ దఫా సభలో రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై అన్ని పార్టీలు చర్చించాయి. ఇక ఇవాళ విద్యుత్ రంగంపై కూడా శ్వేతపత్రాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఇరు పక్షాల మధ్య వాడీవేడీగా వాదనలు కొనసాగాయి. మూడు విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరిపిస్తామని సర్కార్ తెలపగా…. కాళేశ్వరంపై కూడా విచారణ జరిపిస్తామని తెలిపింది.
డిసెంబర్ 21వ తేదీ నాటికి సభలో కాంగ్రెస్‌కు 64, బీఆర్ఎస్‌కు 39, బీజేపీకి 8, మజ్లిస్ పార్టీకి 7, సీపీఐ తరపున ఒక ఎమ్మెల్యే ఉన్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
సంబంధిత కథనం