TS High Court Jobs 2024 : 150 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ - భారీగా వేతనం, ముఖ్య తేదీలివే-telangana high court recruitment 2024 notification for 150 vacancies check the details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts High Court Jobs 2024 : 150 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ - భారీగా వేతనం, ముఖ్య తేదీలివే

TS High Court Jobs 2024 : 150 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ - భారీగా వేతనం, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 25, 2024 01:47 PM IST

Telangana High Court Recruitment 2024: తెలంగాణ హైకోర్టు నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 150 సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…..

తెలంగాణ హైకోర్డు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్
తెలంగాణ హైకోర్డు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్

Telangana High Court Recruitment 2024 Updates : సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను హైకోర్టు విడుదల చేసింది. ఈ పోస్టులకు ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మే 17వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://tshc.gov.in/getRecruitDetails వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు :

  • ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన - తెలంగాణ హైకోర్టు
  • ఉద్యోగాలు - సివిల్ జడ్జి
  • మొత్తం ఖాళీలు - 150(ఇందులో కొన్ని డైరెక్ట్ రిక్రూట్ మెంట్, మరికొన్ని ట్రాన్స్ ఫర్ రిక్రూట్ మెంట్)
  • అర్హతలు - గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి లా డిగ్రీ పొంది ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ రూల్స్ 2023 ప్రకారం నిర్ధేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఈ వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్
  • దరఖాస్తులు ప్రారంభం - ఏప్రిల్ 18, 2024.
  • దరఖాస్తులకు చివరి తేదీ - మే 17, 2024.
  • ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఎస్సీ, ఎస్టీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
  • హాల్ టికెట్లు - 08 జూన్ 2024.
  • స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) - 16 జూన్ 2024.
  • 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • సమయం - 2 గంటలు కేటాయిస్తారు.
  • స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధిస్తే… మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. 1.10గా ఎంపిక ఉంటుంది.
  • స్క్రీనింగ్ టెస్ట్ కోసం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలను ఎగ్జామ్ సెంటర్లుగా ఎంపిక చేశారు.
  • మెయిన్స్ పరీక్షల్లో మూడు పేపర్లు ఉంటాయి. సివిల్ లా, క్రిమినల్ లాతో పాటు ట్రాన్స్ లేషన్ విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి.
  • ప్రతి పేపర్ కు 100 మార్కులు కేటాయిస్తారు.
  • ఇంగ్లీష్ లోనే పరీక్ష ఉంటుంది.
  • చివరగా వైవా కూడా ఉంటుంది. ఇందుకు 1.3గా ఎంపిక ఉంటుంది.
  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెల జీతం రూ. 77,840 - రూ. 1,36,520 వరకు ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ - https://tshc.gov.in/getRecruitDetails
  • అప్లికేషన్ ఫారమ్ కోసం లింక్ - https://cdn3.digialm.com/EForms/configuredHtml/2775/87826/Registration.html

కింద ఇచ్చిన PDFలో ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి స్థాయి నోటిఫికేషన్ ను చూడొచ్చు…

IPL_Entry_Point