TS Gurukul CET Hall Tickets 2024 : గురుకుల ప్రవేశాల హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
Telangana Gurukul CET Hall Tickets 2024: తెలంగాణ గురుకుల సెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 11వ తేదీన ప్రవేశ పరీక్ష జరగనుంది. 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.
Telangana Gurukul CET Hall Tickets 2024: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న వేర్వేరు సంక్షేమ పాఠశాలల్లో ప్రవేశాల కోసం కామన్ అడ్మిషన్ నోటిఫికేష్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఎస్సీ,ఎస్టీ, బీసీతో పాటు సాధారణ గురుకులాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఈ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జామ్ కు సంబంధించిన హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది గురుకుల సొసైటీ. https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాదికి సంబంధించి 643 గురుకులాల్లో మొత్తం 51,924 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే….
-మొదటగా https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
-డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
-Candidate Id/Reference Id, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి GO అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
-పై విధంగానే కాకుండా మీ పేరుతో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. Candidate Name(పేరులోని మొదటి నాలుగు అక్షరాలు)ను ఎంట్రీ చేయంతో పాటు పుట్టిన తేదీని ఎంట్రీ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
-ఇక మొబైల్ నెంబర్ తో కూడా హాల్ టికెట్ జనరేట్ అవుతుంది. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తే పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ ను పొందవచ్చు.
-ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లేందుకు హాల్ టికెట్ తప్పనిసరి. ప్రవేశాల ప్రక్రియలో కూడా కీలకం కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఫిబ్రవరి 11న పరీక్ష..
రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల సంక్షేమ పాఠశాలల్లో 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం 2024 ఫిబ్రవరి 11వ తేదీన ఎగ్జామ్ జరగనుంది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థతో పాటు, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
అభ్యర్ధికి బదులు ఇతరుల ఫోటోలతో దరఖాస్తు చేసే వారిపై ఐపీసీ 416 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని అధికారులు హెచ్చరించారు. విద్యార్ధుల ఎంపికకు ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. సందేహాల నివృత్తి కోసం 180042545678 నంబరును సంప్రదించవచ్చు. అయా జిల్లాల ప్రిన్సిపల్స్ నుంచి కూడా వివరాలు లభిస్తాయ.2023-24 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదవుతున్న విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోడానికి అర్హులని ప్రకటించారు. విద్యార్ధినీ విద్యార్ధులు 4వ తరగతి చదువుతున్నట్లు స్టడీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ చీఫ్ కన్వీనర్, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ నవీస్ నికోలస్ తెలిపారు.
ప్రవేశ పరీక్షను 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఓఎంఆర్ షీట్‌లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.