ఈ ఆర్థిక ఏడాది తొలి రుణం 4 వేల కోట్లు.. ఒక్కొక్కరిపై ఎంత అప్పు అంటే-telangana govt borrows rs 4000 crore through the sale of bonds ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఈ ఆర్థిక ఏడాది తొలి రుణం 4 వేల కోట్లు.. ఒక్కొక్కరిపై ఎంత అప్పు అంటే

ఈ ఆర్థిక ఏడాది తొలి రుణం 4 వేల కోట్లు.. ఒక్కొక్కరిపై ఎంత అప్పు అంటే

HT Telugu Desk HT Telugu
Jun 08, 2022 05:31 PM IST

ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ.. తొలి రుణాన్ని ప్రభుత్వం తీసుకుంది. బాండ్ల విక్రయం ద్వారా రూ.4,000 కోట్లు అప్పుగా తీసుకొంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రెండు నెలలగా కేంద్రం.. తెలంగాణకు అప్పు తీసుకునేందుకు అనుమతివ్వలేదు. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వం తీసుకోలేదు. తాత్కాలికంగా రూ.4,000 కోట్లు రుణంగా తీసుకునేందుకు అనుమతినిచ్చింది. కిందటి శుక్రవారం రాష్ట్ర ఆర్థికశాఖ బాండ్లు జారీ చేసింది. మంగళవారం వేలం పూర్తి కావడంతో తెలంగాణకు రూ.4,000 కోట్లు సమకూరాయి.

2022-23 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా బాండ్లను విక్రయించింది. 13 ఏళ్ల కాలపరిమితితో వీటిని వేలం వేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.59,632 కోట్ల రుణాన్ని సమీకరించుకోవాలని బడ్జెట్‌లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. బాండ్ల వేలం ద్వారానే 55,530 కోట్లు పొందాలని చెప్పింది.

బడ్జెట్‌ పరిధిలో రూ.59,632 కోట్ల రుణాన్ని సమీకరించుకోనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర రుణం రూ.3,29,980 కోట్లు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు రుణాలు ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు రూ.1,45,456 కోట్లకు చేరతాయి. ఈ అప్పులన్నీ కలిపి రాష్ట్ర రుణం మొత్తం రూ.4,75,444 కోట్లకు చేరుతుంది.

ఈ లెక్కల ప్రకారం.. తెలంగాణలో ఒక్కొక్కరిపై తలసరి అప్పు రూ.1,25,116కి చేరుకుంటుంది. ఈ సంవత్సరం వివిధ శాఖలకు అప్పులు ప్రతిపాదించారు. అవి.. నీటిపారుదల శాఖకు రూ.8,940 కోట్లు, నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.7,267 కోట్లు, గృహనిర్మాణానికి రూ.1,528 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.1,472 కోట్లు, రోడ్డు రవాణాకు రూ.1,221 కోట్లు, పశుసంవర్ధకశాఖకు రూ.797 కోట్లు, వైద్యఆరోగ్యానికి రూ.720 కోట్లు, విద్యుత్తు ప్రాజెక్టులకు రూ.374 కోట్లు, ఇతర పరిశ్రమలకు రూ.254 కోట్లు, పంటల సందర్శనకు రూ. 221 కోట్లు, మత్స్య రంగానికి రూ.127 కోట్లు, వివిధ సాధారణ సేవలకు రూ.103 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల రుణాలకు రూ.97 కోట్లు, పాడి అభివృద్ధికి రూ.83 కోట్లు ఉన్నాయి. అంతర్గత రుణాలు రూ.8,700 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నవి రూ.438 కోట్లుగా ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

కిందటి రెండు ఆర్థిక సంవత్సరాల్లోని రుణాల ప్రాతిపదికన ప్రస్తుత ఏడాది రుణపరిమితిని నిర్ణయించనున్నట్లు కేంద్రం లేఖ రాసింది. అయితే దనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు... కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శికి తమ వాదన వినిపించారు. దీనిపై చాలా సేపు మాట్లాడారు. కేంద్రం చెప్పిన విషయాలపై వివరాలు ఇచ్చారు. కిందటి గత వారం రూ.4,000 కోట్ల బాండ్ల విక్రయానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. జూన్‌ నెలాఖరు వరకు రూ.11 వేల కోట్ల రుణ సమీకరణను తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం