Telangana DGP: హైదరాబాద్‌లో హత్యలు పెరిగాయని అసత్య ప్రచారం జరుగుతోందన్న తెలంగాణ డీజీపీ జితేందర్-telangana dgp jitender said that false propaganda is being spread that murders have increased in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Dgp: హైదరాబాద్‌లో హత్యలు పెరిగాయని అసత్య ప్రచారం జరుగుతోందన్న తెలంగాణ డీజీపీ జితేందర్

Telangana DGP: హైదరాబాద్‌లో హత్యలు పెరిగాయని అసత్య ప్రచారం జరుగుతోందన్న తెలంగాణ డీజీపీ జితేందర్

HT Telugu Desk HT Telugu
Aug 14, 2024 06:04 AM IST

Telangana DGP: తెలంగాణ లో హత్యలు పెరుగుతున్నాయని కొంతమంది కావాలనే దృష్ప్రచారం చేస్తున్నారని, డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. గత ఏడాది జులై వరకు హైదరాబాద్ లో 48 హత్యలు జరిగాయని, ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు 48 హత్యలే జరిగాయని, అలాంటప్పుడు హత్యలు పెరిగాయని ఎలా ప్రచారం చేస్తారని అయన ప్రశ్నించారు.

తెలంగాణ డీజీపీ జితేందర్
తెలంగాణ డీజీపీ జితేందర్

Telangana DGP: తెలంగాణలోని హైదరాబాద్‌లో క్రైమ్ రేట్‌ పెరిగిందని కొంతమంది ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని డీజీపీ జితేందర్ అన్నారు. గత ఏడాది జులై వరకు హైదరాబాద్ లో 48 హత్యలు జరిగాయని, ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు 48 హత్యలే జరిగాయని, అలాంటప్పుడు హత్యలు పెరిగాయని ఎలా ప్రచారం చేస్తారని అయన ప్రశ్నించారు.

సంగారెడ్డి జిల్లాలో తన పర్యటన సందర్బంగా, జిల్లా పోలీసులతో క్రైమ్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన డిజిపి, తదనంతరం మీడియా తో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల ఆరోపణల పైన స్పందించారు. కొందరు కావాలనే పోలీసుల పైన నిందలు వేయటానికి ఇలాంటి ప్రచారానికి పాల్పడుతున్నారని అయన అన్నారు. వారు దృష్ప్రచారం చేయటానికి కారణాలు ఏంటి అనే విషయాలు జోలికి తాను వెళ్లానని అన్నారు.

ఇతర రాష్ట్రాల నుండి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయండి…

సంగారెడ్డి జిల్లాకు కర్ణాటక బోర్డర్లో ఉండటంతో, తెలంగాణ నుండి కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్తున్న, అక్కడ నుండి తెలంగాణ లోకి వస్తున్నా అన్ని వాహనాలని పూర్తిగా చెక్ చేయాలనీ. ఎలాంటి వస్తువుల అక్రమ రవాణా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయన పోలీసులను ఆదేశించారు. ప్రయాణకులు ఉన్న వాహనాలను తనిఖీ చేసేటప్పుడు వారికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను అయన కోరారు.

గంజాయి అమ్మకాలపై చెక్ పెట్టండి.…

సంగారెడ్డి జిల్లలో గంజాయి రవాణా, అమ్మకాలు, గంజాయి చెట్ల అమ్మకాలని అరికట్టడంపై పూర్తి దృష్టి పెట్టాలని కోరారు. మట్కా, పేకాట లాంటి జూదం ఆడే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ పొలిసు అధికారులని కోరారు. ఈ సందర్బంగా, సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ జిల్లాలో పోలీసుల పని తీరు పెంచడానికి చేపట్టిన వివిధ చర్యలు వివరించారు. సంగారెడ్డి జిల్లాలో పోలీసులు చాల బాగా పనిచేస్తున్నారు డిజిపి ఈ సందర్బంగా వారిని కొనియాడారు.

డయల్ 100 వెంటనే స్పందించాలి…

ముఖ్యంగా డయల్-100 కాల్స్ విషయంలో బ్లూకోర్ట్ సిబ్బంది త్వరితగతిన స్పందించాలని, అతి తక్కువ కాల వ్యవధిలో నేర స్థలాన్ని చేరుకున్నట్లైతే నేరం యొక్క గ్రావిటీని తగ్గించవచ్చు అని, నేరం జరగకుండ ఆపవచ్చు అన్నారు. అధికారులు సిబ్బంది పోలీసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, సత్ప్రవర్తన తో మెలగాలని అయన సూచించారు.

ఫిర్యాది సమస్యను ఓపికగా విని, వారి సమస్య పరిష్కారం దిశగా తగిన సూచనలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పత్యేక చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు , బ్లింకింగ్ లైట్స్, బోలార్డ్స్ ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. అనుక్షణం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నేరస్తులకు శిక్ష పడే విదంగా చూడాలి.…

నేరస్తులకు కోర్టులో శిక్ష పడినప్పుడే, నేరస్తులు తిరిగి నేరం చేయడానికి భయపడతారని, అదేవిధంగా ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం రోడ్డు ఇంజనీరింగ్ లో లోపాలు ఉన్నట్లయితే ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని సత్సంబంధాలు కలిగినప్పుడే మెరుగైన ఫలితాలు రాబట్ట వచ్చని డిజిపిగుర్తు చేశారు.