Jaggareddy : ఆ మౌనం బలహీనుడి బలహీనత కాదు, టైం కోసం ఎదురుచూస్తాడంతే -జగ్గారెడ్డి
Jaggareddy : ఎన్నికల్లో ఓడిపోయిన పదిరోజుల్లోనే చాలా అనుభవాలు నేర్చుకున్నానని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. బలవంతుడి టైం అయ్యే వరకు బలహీనుడు ఎదురుచూస్తాడని అన్నారు.
Jaggareddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తాను ఈ ఎన్నికల్లో ఓడిపోయినా పదిరోజుల్లోనే చాలా అనుభవాలు నేర్చుకున్నానని ఆధ్యాత్మిక ధోరణిలో మాట్లాడారు. తన ఓటమి తర్వాత విడుదల చేసిన వీడియో ప్రకటనలు కూడా వైరల్ కావటంతో, తన మాటలపైన భిన్నమైన అభిప్రాయాలూ వ్యక్తం కావడంతో, ఈ సారి ఒక పేపర్ ప్రకటనలో తన అభిప్రాయాలూ వెల్లడించారు. పూర్తి ఆధ్యాత్మిక ధోరణిలో మాట్లాడిన జగ్గా రెడ్డి, ఒక బలవంతడు భూమి మీద ఎప్పటికి బలవంతుడిలాగే ఉండడు. కొన్ని సంవత్సరాలు మాత్రమే బలవంతుడిగా ఉంటాడన్నారు. ఏదో ఒక్కరోజు అతను బలహీనుడు కాకతప్పదని అన్నారు. ఇది ఏ వ్యవస్థలో నైనా వ్యాపారం, రాజకీయం ఇంకా ఏ రంగలోనైనా ఇంతే అన్నారు. అలాగే బలహీనుడు ఎప్పటికి బలహీనుడు గానే ఉండడు. ఆ బలవంతుండి సమయం గడిచే వరకు బలహీనుడు మౌనంగానే ఉంటాడని అభిప్రాయ పడ్డారు. ఆ మౌనం బలహీనుడి బలహీనత కాదు. బలహీనుడు తన టైం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కాలం చేసే నిర్ణయంలో బలహీనుడు ఒక్కరోజు బలవంతుడు అవుతాడన్నారు. ఎలాగైతే మనిషి జీవితం యవ్వనం నుంచి ముసలితనం వరకు ఎలా ఉంటుందో. అలాగే ఈ బలవంతుడు -బలహీనుడి కథ కూడా అంతే అని అయన అన్నారు.
గతంలో చేసిన లోపాలను సరిద్దికునే సమయం
ఒక నాయకుడి ఓటమి గత పరిపాలనలో ఉన్న లోపాలను సమీక్షించుకుని భవిష్యత్తులో విజయాలు సాధించడానికి మళ్లీ సవరించుకుని ప్రయాణం చేసి ముందడుగు వేసే సమయం అని జగ్గారెడ్డి అన్నారు. తాను 5 సార్లు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని, సంగారెడ్డి ప్రజలు తనను 3 సార్లు గెలిపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రతిపక్షగా పార్టీ ఎమ్మెల్యేగా పరిపాలించానన్నారు. మొదటి సారి తాను 2014లో ఓడిపోయినని.. ఆ ఓటమి నాకు చాలా అనుభవాలు నేర్పిందన్నారు. ఇప్పుడు 2023లో రెండోసారి ఓడిపోయానని, ఈ 10 రోజులోనే ఇంకా చాలా అనుభవాలు నేర్చుకున్నాన్నారు.
ఈ సమయం పూర్తిగా పార్టీ కోసమే
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు రాష్ట్రంలోని ప్రజలందరికీ అందుతాయన్నారు. ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారానికి సంబంధించి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పూర్తి టైమ్ కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. సోనియా గాంధీ,రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అనుమతితో తన పూర్తి సమయాన్ని పార్టీకే కేటాయించాలనే ఆలోచనను కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ప్రభుత్వంలో ఉన్న వారికి రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తున్నానని తెలిపారు.
రిపోర్టింగ్ : హెచ్.టి.తెలుగు, సంగారెడ్డి ప్రతినిధి