Revanth Reddy | ఆ బియ్యంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి.. కిషన్ రెడ్డికి రేవంత్‌ లేఖ-revanth reddy letter to central minister kishan reddy over paddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy | ఆ బియ్యంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి.. కిషన్ రెడ్డికి రేవంత్‌ లేఖ

Revanth Reddy | ఆ బియ్యంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి.. కిషన్ రెడ్డికి రేవంత్‌ లేఖ

HT Telugu Desk HT Telugu
Apr 14, 2022 10:22 PM IST

ధాన్యం సేకరణపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్‌, ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.

<p>రేవంత్ రెడ్డి</p>
రేవంత్ రెడ్డి

ఎఫ్‌సీఐ గోదాముల్లో మాయమైన బియ్యంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి టీపీసీసీ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎఫ్‌సీఐకి చేరాల్సిన బియ్యం బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి సరఫరా చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో నిర్దరణ అయిందని.. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీబీఐతో దర్యాప్తు జరిపించాలనికిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి తెలిపారు.

yearly horoscope entry point

రాష్ట్రంలో ఏటా రూ. వందల కోట్ల విలువైన ధాన్యం కుంభకోణం జరుగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. మిల్లర్లతో కుమ్మక్కై కుంభకోణం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎంఆర్ పేరుతో మిల్లుల్లో జరిగే అక్రమాలపై విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మిల్లుల్లో బియ్యం రీసైక్లింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు సీఎంఆర్ కేటాయింపులపై విచారణ జరపాలన్నారు. అక్రమ మిల్లులను సీజ్ చేసి దోపిడీ సొమ్ము వసూలు చేయాలని లేఖలో రేవంత్ రెడ్డి ప్రస్తావించారన్నారు.

'రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్‌, ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పెద్దలు రైస్‌ మిల్లర్లతో కుమ్మక్కై ఏటా వందల కోట్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎఫ్‌సీఐ అధికారుల క్షేత్ర తనిఖీల్లో వెల్లడైంది. రైస్‌ మిల్లులకు కేటాయించిన నిల్వల్లో ఏకంగా 4 లక్షల 53 వేల 896 బస్తాల ధాన్యం కనిపించలేదు. వాటి విలువ రూ. 45 కోట్లుగా ఉంటుందని అధికారులు తేల్చారు.' అని లేఖలో రేవంత్‌ ప్రస్తావించారు.

ఎఫ్‌సీఐకి చేరాల్సిన బియ్యం బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుని రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి సరఫరా చేస్తున్నట్లు నిర్ధరణ అయ్యిందని కిషన్ రెడ్డికి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3,200కు పైగా రైసు మిల్లులు ఉన్నాయన్నారు. 900 మిల్లుల్లో తనిఖీ చేస్తేనే రూ.400 కోట్ల కుంభకోణం బయటపడిందన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం