Revanth Reddy: ఆ ముగ్గురి బీజేపీ నేతల సిద్ధాంతాలు వేరు - రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు -revanth reddy intresting comments on three bjp leaders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy: ఆ ముగ్గురి బీజేపీ నేతల సిద్ధాంతాలు వేరు - రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Revanth Reddy: ఆ ముగ్గురి బీజేపీ నేతల సిద్ధాంతాలు వేరు - రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
Jan 26, 2023 08:49 PM IST

Revanth Reddy Comments: పార్టీ ఫిరాయింపుదారులను ఉరి తీసే చట్టాలు రావాలన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఫిబ్రవరి 6 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర 60 రోజుల పాటు సాగుతుందని ప్రకటించారు. ఇక బీజేపీలోని ముగ్గురు నేతలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

Republic Day Celebrations at Gandhi Bhavan: హత్యలు, ఆత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను పార్టీ ఫిరాయించిన వారికి వర్తింపజేయాలన్నారు టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన విషయాన్నిమేధావులు ఆలోచించాలన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీ భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ నాయకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పార్టీ మారిన సభ్యుడి సభ్యత్వం రద్దు చేసే చట్టాలు తేవాలన్నారు. పార్టీ ఫిరాయింపులు దేశానికి ప్రమాదకరంగా పరిణమించాయని వ్యాఖ్యానించారు.

"దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఎంతో కృషి చేసింది. దేశ ప్రగతికి ఎన్నో ప్రాజెక్టులు, కార్యమాలు కాంగ్రెస్ చేపట్టింది. ఇంత అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని కొంత మంది అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ తెచ్చిన విద్యా హక్కును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. విద్యను దూరం చేసి పెదలను మధ్య యుగం వైపు నెడుతున్నారు. అబద్ధపు పునాదుల మీద బీజేపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళ విధానాలు చూస్తుంటే.. రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ పబ్లిక్ సెక్టార్ రంగాన్ని పెంచింది. బీజేపీ మాత్రం దాన్ని ప్రయివేట్ పరం చేస్తోంది. లక్షలాది కోట్ల విలువైన ఆస్తులను చిల్లర ధరకు అమ్ముకుంటోంది. పబ్లిక్ సెక్టార్ సంస్థలను అమ్మడానికి ఓ మంత్రినే పెట్టిన ఘనుడు మోదీ. దళితులు, గిరిజనులు, బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయి. దేశంలో రిజర్వేషన్ స్ఫూర్తి దెబ్బ తీసే కుట్ర జరుగుతుంది" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఏళ్లు గడుస్తున్నా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం సిగ్గు చేటు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవాన్ని ప్రగతి భవన్, రాజ్ భవన్ కు పరిమితం చేసి.. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రిపబ్లిక్ డే ని నిర్వహించాలని కోర్టు అదేశించే పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరమన్నారు. కేసీఆర్ వ్యవహారశైలిని మార్చుకోవాలని హితవు పలికారు. గవర్నర్.. సీఎం మధ్య విభేదాలు ఉంటే వేరే వేదిక మీద చూసుకోవాలి కానీ అందుకు గణతంత్ర దినోత్సవాన్ని ఉపయోగించుకోవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ రోజు హాత్ సే హాత్ జోడో యాత్ర లాంఛనంగా ప్రారంభించినా.. ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులపాటు కొనసాగుతుందన్నారు. రాహుల్ జోడో యాత్ర స్ఫూర్తితో ప్రతీ గడప వెళతామన్నారు. నిరంతరం పాదయాత్రలో పాల్గొంటామన్నారు. పార్టీ ఆదేశించినట్టు పాదయాత్ర కొనసాగుతుందని , తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి అన్నారు.

కీలక వ్యాఖ్యలు...

అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఏ లక్ష్యం కోసం రాజేందర్ బీజేపీ లోకి వెళ్ళాడో .. ఆ లక్ష్యం అక్కడ నెరవేరడం లేదని ఆయన మాటల్లో స్పష్టమైందన్నారు. "కేసీఆర్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో ఆయన బీజేపీలో చేరారు. కానీ బీజేపీలోకి వెళ్ళాక రాజేందర్ కు అర్థమైంది .. అక్కడ కూడా కేసీఆర్ కోవర్ట్ లు ఉన్నారని. రాజేందర్ లక్ష్య సాధన కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాల్సి పరిస్థితి వచ్చింది. కేసీఆర్ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ ఆయన గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నాయకులు .. ఇప్పుడు ఆ పార్టీ లో సంతృప్తిగా లేరు. బీజేపీ కేసీఆర్ ఒక్కటే అన్న విషయం రాజేందర్ మాట్లల్లో స్పష్టమైంది కాబట్టి ప్రజలు దీనిపై ఆలోచించాలి. రాజేందర్, వివేక్, విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీ సిద్దాంతాలను విశ్వసించరు. కేవలం కేసీఆర్ ను మాత్రమే వ్యతిరేకిస్తారు. బీజేపీ ఐడీయాలజీతో ఆ ముగ్గిరికి సంబంధం లేదు. బీజేపీ లో కూడా కోవర్ట్ లు ఉన్నారని రాజేందర్ అన్నారంటే .. ఏదో అసంతృప్తి ఉన్నట్లే కాదా. ఈ పరిస్థితుల్లో రాజేందర్ ముందుకు రాలేక, వెనక్కి పోలేక అక్కడే మిగిలిపోయారు. కేసీఆర్ ను ఓడించాలనే లక్ష్యం తో బీజేపీ లో చేరినా.. ఆ లక్ష్యం నెరవేరడం లేదనే అసంతృప్తితో ఈటెల రాజేందర్, వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి లు ఉన్నారు" అని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. పార్టీ హైకమాండ్ భట్టి కి ఆ భాధ్యతలు ఇచ్చిందన్నారు. కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేస్తామని.. ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయుసును 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గిస్తామన్నారకు. కలెక్టర్ గా 21 సంవత్సరాల అధికారి భాధ్యతలు నిర్వహించగా.. 21 సంవత్సరాల వ్యక్తి ఎమ్మెల్యే గా ఎందుకు పోటీ చేయకూడదన్నారు.

కొడంగల్ లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే దత్తత తీసుకుంటా అన్నారని గెలిపించాక ఇప్పుడు ఏ గ్రామాన్ని అభివృద్ధి చేశారో చూపించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పదేళ్లు తాము చేసిన అభివృద్ధిని ఈ అయిదేళ్లలో 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు అని వ్యాఖ్యానించారు. ఎనిమిది మండలాలు ఉన్న వనపర్తి జిల్లా అయింది. మరి ఎనిమిది మండలాలు ఉన్న కొడంగల్ రెవెన్యూ డివిజన్ ఎందుకు కాకూడదన్నారు. సీఎం కేసీఆర్ కొడంగల్ పై కక్ష కట్టారని.. అందుకే కొడంగల్ నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి.. మూడు జిల్లాల్లో కలిపారని ఆరోపించారు. పద్మా అవార్డు గ్రహీతలకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

IPL_Entry_Point