TG Paramedical Admissions 2024 : పారామెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు - ఇవిగో నోటిఫికేషన్ వివరాలు-notification for admissions in paramedical diploma courses in telangana 2024 key dates read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Paramedical Admissions 2024 : పారామెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు - ఇవిగో నోటిఫికేషన్ వివరాలు

TG Paramedical Admissions 2024 : పారామెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లు - ఇవిగో నోటిఫికేషన్ వివరాలు

తెలంగాణలోని పారామెడికల్‌ కాలేజీల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 30వ తేదీలోపు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను జిల్లా డీఎంహెచ్‌వో ఆఫీసుల్లో సమర్పించాలి. జిల్లాల వారీగా నవంబరు 13లోపు కౌన్సెలింగ్‌ పూర్తి అవుతుంది. నవంబర్‌ 20వ తేదీలోగా ఎంపిక జాబితా విడుదలవుతుంది.

పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు

పారామెడికల్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన జారీ అయింది. 2024-2025 విద్యా సంవత్సరానికి తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ మేరకు నోటిఫికేషన్ లో వివరాలను పేర్కొన్నారు.

ముఖ్య తేదీలు:

అక్టోబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సంబంధిత జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందజేయాలి. జిల్లాల వారీగా నవంబరు 13లోపు కౌన్సెలింగ్‌ పూర్తి చేస్తారు.నవంబర్ 20వ తేదీలో పు ఎంపిక జాబితా విడుదలవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 ప్రభుత్వ పారామెడికల్ సంస్థల్లో మొత్తం 3,122 సీట్లు ఉన్నాయి. ఇవే కాకుండా పారామెడికల్ కోర్సుల్లో కూడా సీట్లు అందుబాటులో ఉంటాయి.

ఇంటర్మీడియట్ అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ కోర్సుల కాలపరిమితి 2 ఏళ్లు ఉంటుంది. https://tgpmb.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నవంబర్ 25వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

అభ్యర్థులు ఏమైనా సందేహాలు ఉంటే secypmb@telangagana.gov.in మెయిల్ లేదా 040 -24653519 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. https://tgpmb.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచే దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. మొత్తం 21 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.