IndiGo Airlines : తెలుగు మహిళను తన సీటు నుంచి లేపిన ఇండిగో సిబ్బంది.. కేటీఆర్ సీరియస్-minister ktr respond on telugu woman moved from her seat in indigo flight ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Indigo Airlines : తెలుగు మహిళను తన సీటు నుంచి లేపిన ఇండిగో సిబ్బంది.. కేటీఆర్ సీరియస్

IndiGo Airlines : తెలుగు మహిళను తన సీటు నుంచి లేపిన ఇండిగో సిబ్బంది.. కేటీఆర్ సీరియస్

HT Telugu Desk HT Telugu
Sep 18, 2022 05:22 PM IST

IndiGo Flight From Vijayawada : ఇండిగో విమానంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు.

<p>ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న మహిళ</p>
ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న మహిళ

ఇండిగో విమానంలో ఓ తెలుగు ప్రయాణికురాలికి అవమానం జరిగింది. ఆమె కూర్చున్న స్థానం నుంచి అయిష్టంగా లేపి వేరే స్థానంలో కూర్చోబెట్టారు ఇండిగో సిబ్బంది. ఆమెకు తెలుగు తప్ప ఇంగ్లిష్, హిందీ భాషలు రావు. ఈ విషయాన్ని నిర్దారించుకున్న విమాన సిబ్బంది సీటు మార్చారు. 2A స్థానంలో కూర్చుని ఉన్న ఆమెను 3Cలో కూర్చోమని తెలిపారు. విమాన సిబ్బంది చెప్పినట్టుగానే ఆమె వినింది. వెళ్లి వేరే సీటులో కూర్చొంది.

ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ అహ్మదాబాద్‌లోని ఐఐఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవస్మిత చక్రవర్తి తన ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ఓ తెలుగు మాట్లాడే మహిళను ఇంగ్లీషు, హిందీ అర్థం చేసుకోలేక సీటు నుంచి ఎలా కదిలించారో షేర్ చేశారు.

'ఒక తెలుగు మహిళ సెప్టెంబర్ 16వ తేదీన ఇండిగో 6E 7297లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తొంది. 2A(XL seat, Exit row)లో కూర్చుని ఉంది. ఆమెతో మాట్లాడిన ఫ్లైట్ అటెండెంట్ ఆమెకు తెలుగు మాత్రమే అర్థం అవుతుందని, హిందీ, ఇంగ్లిష్ రాదని తెలుసుకున్నారు. 2A లో ఉన్న ఆమెను 3C సీట్లో కూర్చోమని చెప్పారు. ఆమె వాళ్లు చెప్పినట్టుగానే చేసింది.' వివక్ష చూపించారని ట్వీట్ చేశారు.

ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. ఈ విషయంపై సీరియస్ అయ్యారు. ఇండిగో యాజమాన్యానికి ట్యాగ్ చేస్తూ.. పోస్ట్ పెట్టారు. ఇక నుంచైనా స్థానిక భాషను, స్థానిక భాషలు మాత్రమే తెలిసిన ప్రయాణికులను గౌరవించాలని చెప్పారు. హిందీ, ఇంగ్లిష్ భాషలు అనర్గళంగా మాట్లాడలేని అటువంటి ప్రయాణికులను గౌరవించాలని సూచించారు. విమానాలు ప్రయాణించే రూట్స్ ఆధారంగా.. స్థానిక భాషను మాట్లాడగలిగే సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. అలా చేస్తే.. ప్రయాణికులకు, సిబ్బందికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం