Medico Suicide: విషం ఇంజెక్ట్ చేసుకుని మెడికో ఆత్మహత్య… ఔటర్ రింగ్ రోడ్డుపై వైద్యురాలి విషాదాంతం
Medico Suicide: వైద్య విద్యలో పీజీ పూర్తి చేయాలనే కోరిక తీరకుండానే ఓ మెడికో బలవన్మరణానికి పాల్పడింది. కారులోనే గుర్తు తెలియన ఇంజెక్షన్ చేసుకుని ప్రాణాలు విడిచింది.
Medico Suicide: కష్టపడి చదివి డాక్టర్ అయ్యింది. ఎంబిబిఎస్ పూర్తి చేసి పీజీ చదువుతోంది. కొద్దిరోజుల్లో పీజీ వైద్య విద్య పూర్తి కానుండగా, ఏమి కష్టం వచ్చిందో ఏమో కానీ విషం తగి ఆత్మహత్యకు పాల్పడింది.
అవుట్ రింగ్ రోడ్డులో తన కారులోనే అపస్మారక స్థితిలో ఉన్న డాక్టర్ రచనా రెడ్డిని (25) రోడ్‌పై వెళుతున్న వాహనదారులు గమనించి అమీనాపూర్ పోలీసులకు ఫోన్ సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే, అంబులెన్సులో బాచుపల్లి లో ఉన్న మమతా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు.
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం లో నివాసం ఉంటున్న రచనా రెడ్డి, ఖమ్మం పట్టణంలో ఉన్నమమతా మెడికల్ కాలేజీ లో పీజీ కోర్సు చేస్తుంది. పీజీ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని బాచుపల్లి లో ఉన్న మమతా మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తోంది.
ఔటర్ రింగ్ రోడ్డు పైన అపస్మారక స్థితిలో…
కొద్ది రోజుల్లో కోర్స్ పూర్తీ కానుండగా, సోమవారం తన కార్ లో అపస్మారక స్థితి పడి ఉండటాన్ని స్థానికులు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ సుల్తాన్‌పూర్ ప్రాంతంలో గమనించారు.
వెంటనే డయల్ 100 కు కాల్ చేయగా, అమీనాపూర్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కోన ప్రాణంతో ఉన్న డాక్టర్ రచనా రెడ్డిని వెంటనే మమతా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం నాలుగు గంటలకు తాను తుది శ్వాస విడిచారు.
ఈ ఘటన ఇంటర్న్‌షిప్ చేస్తున్న ఆసుపత్రిలో, తోటి విద్యార్థులలో తీవ్ర విషాదం నింపింది. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం లో నివాసం ఉంటున్న తన తల్లి తండ్రులు మాత్రం తమ కూతురుకి ఎలాంటి ఇబ్బందులు లేవని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు…
సంఘటన జరిగిన సమయంలో , కారులో ఆమె ఒక్కతే ప్రయాణిస్తుందా మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువు ఒత్తిడి తట్టుకోలేక తాను ఈ నిర్ణయం తీసుకున్నాదా, లేకపోతె తనను ఎవరైనా వేధిస్తున్నారా అనే కోణములో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కారులో రచనా రెడ్డి డ్రైవర్ సీట్లో, సీటు బెల్ట్ పెట్టుకొని ఉండటం గమనార్హం. చేతికి కాన్యులా ఉండటంతో విష పదార్ధం తీసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే తామూ ఒక నిర్ణయానికి రాగాలుతామని అంటున్నారు కుటుంబ సభ్యుల రచనా రెడ్డి చిన్ననాటి నుండి చదువులో ఎప్పుడు ముందంజలో ఉండేదని, డాక్టర్ కావటమే తన జీవితాశయమని. ఆ కోరిక పూర్తిగా తీరకముందే పరలోకాలకు చేరుకున్నదని వారు కన్నీరుమున్నీరు అవుతున్న్నారు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)