Medak Road Accident : ప్రాణాలు తీసిన ధాన్యం కుప్పలు, మెదక్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల సహా నలుగురు మృతి-medak road accident tractor dashed bike four members including two children died on spot ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Road Accident : ప్రాణాలు తీసిన ధాన్యం కుప్పలు, మెదక్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల సహా నలుగురు మృతి

Medak Road Accident : ప్రాణాలు తీసిన ధాన్యం కుప్పలు, మెదక్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల సహా నలుగురు మృతి

Medak Road Accident : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్లపై ధాన్యం కుప్పలు నలుగురి ప్రాణాలు తీశాయి. ధ్యానం కారణం రోడ్డుకు ఒక వైపున వాహనాల రాకపోకలు సాగించడంతో...అతి వేగంగా వచ్చిన ట్రాక్టర్ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల సహా నలుగురు మృతి చెందారు.

ప్రాణాలు తీసిన ధాన్యం కుప్పలు, మెదక్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల సహా నలుగురు మృతి (HT_PRINT)

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మనోహరాబాద్‌ మండలం పోతారం వద్ద రోడ్డుపై స్థానిక రైతులు వరి ధాన్యం ఆరబెట్టారు. రోడ్డుపై ధాన్యం కుప్పలు ఉండడంతో...వాహనాల రాకపోకలు రోడ్డుకు ఒకవైపు నుంచే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ఓ ట్రాక్టర్‌ ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తు్న్న మన్నె ఆంజనేయులు(50), ఆయన మరదలు లావణ్య(35), ఆమె ఇద్దరు పిల్లలకు సహస్ర(10), శాన్వి(6) తీవ్రగాయాలై సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. మృతులు పోతారం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

కోదాడ వద్ద బస్సు ప్రమాదం

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడలోని కట్టకొమ్ముగూడెం వద్ద ఆగి ఉన్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును...వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తోన్న ఓ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ బస్సును డ్రైవర్‌ రోడ్డు పక్కకు ఆపాడు. అదే క్రమంలో వెనుక నుంచి వచ్చిన బీహెచ్‌ఈఎల్‌ డిపోకు చెందిన టీఎస్‌ 9 జెడ్‌ 7818 సూపర్‌ లగ్జరీ బస్సు ఆగి ఉన్న బస్సును వేగంగా ఢీకొట్టింది. దీంతో ప్రైవేటు బస్సు వెనుక భాగం, ఆర్టీసీ బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో 28 మందికి స్వల్పగాయాలవ్వగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఒడిశాలో ఆరుగురు మృతి

ఒడిశా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుందర్‌ఘర్ జిల్లాలో వ్యాన్‌ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున గైకనపాలి ప్రాంతంలో వ్యాన్‌ వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతులు కందగోడ, సమర్పింద గ్రామాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు వైద్యం అందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.

సంబంధిత కథనం