Hyderabad GO 111 : కనిపించని జీవో 111 ఎఫెక్ట్ - కోకాపేట ధరలతో మారిన అంచనాలు!-land rates in the surrounding areas have not decreased despite the lifting of 111 go ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Go 111 : కనిపించని జీవో 111 ఎఫెక్ట్ - కోకాపేట ధరలతో మారిన అంచనాలు!

Hyderabad GO 111 : కనిపించని జీవో 111 ఎఫెక్ట్ - కోకాపేట ధరలతో మారిన అంచనాలు!

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 06, 2023 10:20 AM IST

GO 111 Withdraw in Hyderabad : ఎప్పటి నుంచో వివాదం నడుస్తున్న జీవో 111ను ఇటీవలే తెలంగాణ సర్కార్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం రియల్ రంగంపై ప్రభావం చూపుతుందని… ధరలు తగ్గిపోతాయన్న అభిప్రాయాలు వినిపించాయి. కానీ అందుకు భిన్నంగా తాజాగా కోకాపేట భూముల వేలం ఆల్ టైం రికార్డు సృష్టించింది.

కనిపించని జీవో 111 ప్రభావం
కనిపించని జీవో 111 ప్రభావం

GO 111 Withdraw Latest News : కొద్దిరోజుల కింటే 111 జీవో రద్దుకు కేబినెట్ ఆమోదం తెలపటంతో....84 గ్రామాల పరిధిలో సంబరాలు మిన్నంటాయి. ఇదే సమయంలో రద్దు నిర్ణయం ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగంపై గట్టి ప్రభావం పడిందనే అభిప్రాయాలు వినిపించాయి. భూమల కొనుగోళ్లు, ఫ్లాట్లు, ఇండ్ల కొనుగోళ్ల దూకుడుకు బ్రేకులు పడ్డాయని… మళ్లీ ఎన్నికల తర్వాతే రియల్ రంగం పుంజుకునే అవకాశం ఉందన్న చర్చ వినిపించింది. కానీ అందుకు భిన్నంగా హైదరాబాద్ రియల్ రంగం ముందుకెళ్తోంది. తాజాగా కోకాపేటలో ప్రభుత్వం చేపట్టిన వేలం ప్రక్రియలో ఆల్ టైం రికార్డు ధరలు నమోదయ్యాయి. దీంతో హైదరాబాద్ భూముల ధరలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

జీవో 111ను రద్దు చేసిన తర్వాత… చాలా ప్రాంతాల్లో రియల్ రంగం డీలాపడిపోయింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఫ్లాట్ల కొనుగోళ్లు పెద్దగా జరగలేదు. నగరంలోని చాలా చోట్ల నిర్మించిన ఫ్లాట్ల అమ్మకాలు కూడా తగ్గాయి. దీనికితోడు హెచ్ఎండీఏ వేలం వేస్తున్న భూములకు కూడా ఆదరణ తగ్గింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూముల క్రయ విక్రయాలపై దాదాపు రోజుకు 40 కోట్ల ఆదాయం వస్తే... జీవో 111 ఎత్తివేసిన టైంలో రూ. 20 కోట్లకు పడిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే 111 జీవోతో దాదాపు లక్ష ఎకరాల భూమి అందుబాటులోకి రావటంతో…అందరి చూపు 84 గ్రామాల వైపు మళ్లే ఛాన్స్ ఉంటుందని భావించారు. నిర్మాణ రంగంతో పాటు పెట్టుబడుదారులు… ఈ జీవో పరిధిలో పెట్టుబడులు పెడుతారననే అంచనాలు వినిపించాయి.

గత కొంత కాలంగా శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వేలం వేస్తోంది హెచ్ఎండీఏ. ఫలితంగా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. పలుచోట్ల గజం ధర లక్ష రూపాయలు దాటిన పరిస్థితులు కూడా కనిపించాయి.ఫేజ్ 1లో పరిస్థితితో పోల్చితే జీవో 111 రద్దు చేసిన తర్వాత చేపట్టిన ఫేజ్ 2లో కొనుగోళ్లు దారులు ఆసక్తి చూపించలేదు. కోకాపేట వంటి ప్రాంతాల్లో భారీగా ధరలు పడిపోయే ఛాన్స్ ఉందన్న చర్చ ప్రధానంగా తెరపైకి వచ్చింది. అయితే వీటన్నింటిని తలకిందులు చేస్తూ… తాజాగా హెచ్ఎండీఏ చేపట్టిన వేలం ఏకంగా ఎకరం భూమి వంద కోట్లు దాటింది. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ఎకరం ధరనే రూ. 35గా ఉంది. మొత్తంగా 45 ఎకరాల్లో ఉన్న ఏడు ప్లాట్‌లతోనే రూ.3,319 వేల కోట్లను ఆర్జించింది. ఫలితంగా కోకాపేట భూమి ధరలు కేక పుట్టించినట్లు అయింది. దీంతో హైదరాబాద్ భూముల ముచ్చట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మొత్తంగా జీవో 111 రద్దుతో లక్ష ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చినప్పటికీ…. భూములకు ఈ స్థాయి ధరలు రావటంపై రియల్ రంగం నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు బుద్వేల్ లో కూడా భూముల వేలానికి నోటిఫికేషన్ జారీ చేసింది హెచ్ఎండీఏ. ఇక్కడి భూములకు కూడా భారీగా ధరలు పలికే అవకాశం కనిపిస్తోంది.

Whats_app_banner