Hyderabad : ఉప్పల్ లో బోర్డు తిప్పేసిన రియల్ ఎస్టేట్ సంస్థ.....కోట్ల రూపాయలతో ఉడాయించిన కిలాడీ కపుల్ !-jv builders real estate company fraud in uppal hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Jv Builders Real Estate Company Fraud In Uppal Hyderabad

Hyderabad : ఉప్పల్ లో బోర్డు తిప్పేసిన రియల్ ఎస్టేట్ సంస్థ.....కోట్ల రూపాయలతో ఉడాయించిన కిలాడీ కపుల్ !

HT Telugu Desk HT Telugu
Mar 20, 2024 10:49 AM IST

Real Estate Company Fraud in Uppal: హైదరాబాద్ నగరంలో మరో రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఆకర్షణీయమైన ప్రకటనలో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. మోసపోయామని గ్రహించిన బాధితులు… పోలీసులను ఆశ్రయించారు.

రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం
రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం (unsplash.com)

Real Estate Company Fraud in Uppal: హైదరాబాద్ నగరంలో మరో భారీ మోసం వెలుగు చూసింది. ఉప్పల్ నల్లచెరువు సమీపంలోని విమల నివాస్ లో వేలూరు లక్ష్మినారాయణ,జ్యోతి దంపతులు జేవి బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఓ సంస్థ(Real Estate Company Fraud) నిర్వహిస్తున్నారు.ఈ సంస్థను గతంలో బోడుప్పల్ మరియు మేడిపల్లి లో నడిపించి ఆ తరువాత అక్కడి నుంచి ఉప్పల్ కు మార్చారు.రకరకాల ఆకర్షనీయమైన స్కీములు తమ దగ్గర ఉన్నాయని మా సంస్థలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించి బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూల్ చేశారు. రూ.10 లక్షలు పెడితే ప్రతీ 15 రోజులకు రూ.20 వేల వడ్డీతో పాటు అసలు రూ.లక్ష చొప్పున ఇస్తామని అమాయకులను నమ్మించారు.పెట్టుబడి పెట్టినవారికి మరింత నమ్మకం కల్గించేందుకు కొందరి వ్యవసాయ,వ్యవసాయేతర భూములను కూడా రిజిస్ట్రేషన్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

బోర్డ్ తిప్పేశారు…! కోట్లు స్వాహా

కొత్త సభ్యులను చేర్పిస్తే పెద్ద మొత్తంలో కమీషన్లు ఇస్తామని కూడా బాధితులకు మాయ మాటలు చెప్పారు.ఈ క్రమంలోనే వేల మంది ఆకర్షితులై ఆ కంపెనీకి డబ్బులు చెల్లించారు.ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఓ బాధితుడు ఏకంగా రూ.18 లక్షలు పెట్టాడు.ఏజెంట్ గా కూడా చేరి మరి కొంత మందిని చేర్పించాడు.బాధితులను నమ్మించెందుకు కొన్ని రోజుల వరకు సక్రమంగా డబ్బులు చెల్లించిన ఆ సంస్థ గత కొన్ని రోజులుగా ఎవరికి డబ్బులు చెల్లించడం లేదు. బాధితులు కాల్ చేసినా స్పందించడం లేదు.దీంతో అనుమానం వచ్చిన కొందరు ఆ సంస్థ ఆఫీస్ కు వెళ్లి చూడగా..... తాళం వేసి ఉండడంతో మోసపోయామని గ్రహించారు.దీంతో వెంటనే బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.10 మంది బాధితులు కలిసి రూ.2 కోట్లు పెట్టుబడులు పెట్టామని ఫిర్యాదు లో పేర్కొన్నారు.బాధితుల సంఖ్య వేలల్లో....చెల్లించిన డబ్బు కోట్లలో ఉంటుందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జింక కొమ్ములు విక్రయానికి యత్నం.....నిందితులు అరెస్ట్

అక్రమంగా సేకరించిన జింక కొమ్ములను విక్రయించేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీరిని అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు డీసిపి రష్మీ ప్రకటించారు. మెదక్ జిల్లాకు చెందిన శోభన్ బాబు నగరంలో పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.వరంగల్ జిల్లాకు చెందిన నగల వ్యాపారి నాగ చారితో శోభన్ బాబుకు పరిచయం ఏర్పడింది.గతంలో ఒకటి రెండు సందర్భాల్లో శోభన్ పక్షులు మాసం తెచ్చి నాగ చారికి ఇచ్చాడు.దీంతో ఇతడు జింక కొమ్ములు ఉంటే తీసుకురావాలని.....వాటిని మార్కెట్ లో ఎక్కువ సొమ్ముకు విక్రయించి సొమ్ము చేసుకుందని పథకం పన్నాడు.దీంతో రెండు రోజుల క్రితం సూరారం ప్రాంతానికి చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తికి శిభాన్ రూ.2 వేలు చెల్లించి రెండు జింక కొమ్ములు తీసుకొని నాగచారికి ఇవ్వగా....అతడు సికింద్రాబాద్ లో అధిక ధరలకు విక్రయం చేసే ప్రయత్నాలు చేయగా....సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రామయ్య నేతృత్వంలో నిందితులను పట్టుకున్నారు.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

IPL_Entry_Point