IRCTC Tour Package : 4 రోజుల 'తిరుమల' ట్రిప్ - బడ్జెట్ ధరలోనే ఈ 4 ప్రముఖ ఆలయాలను చూడొచ్చు, ప్యాకేజీ వివరాలివే-irctc tourism operate 4 days poorva sandhya tour package from hyderabad 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Tour Package : 4 రోజుల 'తిరుమల' ట్రిప్ - బడ్జెట్ ధరలోనే ఈ 4 ప్రముఖ ఆలయాలను చూడొచ్చు, ప్యాకేజీ వివరాలివే

IRCTC Tour Package : 4 రోజుల 'తిరుమల' ట్రిప్ - బడ్జెట్ ధరలోనే ఈ 4 ప్రముఖ ఆలయాలను చూడొచ్చు, ప్యాకేజీ వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 25, 2024 05:45 PM IST

IRCTC Poorva Sandhya Tour 2024 : పూర్వ సంధ్య పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి,తిరుచానూర్ తో పాటు తిరుమల వెళ్లాలనుకునే వారి కోసం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…..

హైదరాబాద్ టూ తిరుమల
హైదరాబాద్ టూ తిరుమల

IRCTC Poorva Sandhya Tour 2024 : ఈ వేసవిలో అధ్యాత్మిక ప్రదేశాలను చూసే ప్లాన్ ఉందా..? పవిత్ర పుణ్యక్షేత్రానికి మారుపేరైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవటమే కాకుండా చుట్టుపక్కల ఉండే ఆలయాలను చూడాలని అనుకుంటున్నారా..? మీలాంటి వారికి శుభవార్తను చెప్పింది IRCTC టూరిజం. చాలా తక్కువ ధరతోనే పూర్వ సంధ్య టూర్(Poorva Sandhya Tour) ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ నాలుగు రోజుల పాటు సాగుతోంది. ప్రస్తుతం మే 2వ తేదీన అందుబాటులో ఉంది.

పూర్వ సంధ్య టూర్ ప్యాకేజీ వివరాలు:

  • పూర్వ సంధ్య టూర్(IRCTC Poorva Sandhya Tour) పేరుతో ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్ సీటీసీ టూరిజం.
  • మొత్తం 4 రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది.
  • హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.
  • ప్రస్తుతం ఈ టూర్ మే 02, 2024వ తేదీన అందుబాటులో ఉంది.
  • మొదటి రోజు లింగంపల్లి నుంచి సాయంత్రం 06:25 గంటలకు రైలు(Train No. 12734 Express) బయలుదేరుతుంది. సికింద్రాబాద్ 07:05 గంటలకు చేరుకుంటుంది. నల్గొండ నుంచి 08:35 గంటలకు చేరుకుంటుంది. నైట్ అంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 06:55 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. హోటల్‌కి తీసుకెళ్తారు. అనంతరం శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల దర్శనం ఉంటుంది. ఆ తర్వాత…. శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాన్ని సందర్శించాలి. తర్వాత హోటల్‌కి తిరిగి వెళ్తారు. రాత్రి తిరుపతిలో బస చేస్తారు.
  • మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. 08:30 గంటలకు వేంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. సాయంత్ర 06:20 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
  • Day - 4 : టైన్ నల్గొండ స్టేషన్ కు 03:04 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌కు 05:35 గంటలకు, లింగంపల్లికి ఉదయం 06:55 గంటలకు రావటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
  • హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ పూర్వ సంధ్య టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 7720 గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ. 5860, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.5,660గా నిర్ణయించారు.
  • ఇదే ప్యాకేజీ ధరలను కంఫర్ట్ క్లాసులో చూస్తే… సింగిల్ ఆక్యూపెన్సీ ధర రూ.9570గా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీ రూ. 7720, ట్రిపుల్ ఆక్యూపెన్సీ రూ.7510గా నిర్ధారించారు.
  • ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లల కోసం వేర్వురు ధరలు ఉన్నాయి.
  • https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవటంతో పాటు మరిన్ని ప్యాకేజీల వివరాలను కూడా చూడొచ్చు.
  • ఏమైనా సందేహాలు ఉంటే 9701360701 / 8897217735 ఫోన్ నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.

IPL_Entry_Point