Telangana Govt : రేవంత్ రెడ్డి పాలన షురూ.. ప్రగతి భవన్ పేరు మార్పు, అధికారుల నియామకాలపై కీలక ఉత్తర్వులు
CM RevanthReddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన షురూ అయింది. గురువారం మధ్యాహ్నం బాధ్యతలు తీసుకున్న ఆయన… కీలక నిర్ణయాలు తీసుకునే పనిలో పడ్డారు.
CM RevanthReddy : ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ప్రమాణస్వీకారం సందర్భంగా… రెండు ఫైళ్లపై సంతకం చేశారు. ఇందులో కీలకమైన ఆరు గ్యారెంటీల హామీల అమలు ఫైల్ ఉంది. అంతేకాకుండా… ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… ప్రగతి భవన్ పేరును కూడా జ్యోతి రావు ఫూలే ప్రజాభావన్ గా మారుతుందని చెప్పారు. ప్రజాదర్భార్ కూడా నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
కీలక నియామకాలు
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న కాసేపట్లోనే కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్ ఐజీగా శివధర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వీరే కాకుండా మరికొందరు అధికారుల మార్పు ఉంటుందని తెలుస్తోంది.
కేబినెట్ భేటీ
మరోవైపు గురువారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఇందులో ఎలాంటి అంశాలపై చర్చించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆరు గ్యారెంటీల హామీల అమలుపై ప్రధానంగా చర్చిస్తారని తెలిసింది.
మంత్రుల శాఖలు :
హోమ్ మంత్రి - ఉత్తమ్ కుమార్ రెడ్డి
మునిసిపల్ - కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ఆర్ధిక శాఖా మంత్రి - శ్రీధర్ బాబు
నీటి పారుదల శాఖా మంత్రి - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మహిళా సంక్షేమ శాఖా మంత్రి - కొండా సురేఖ
రెవెన్యూ శాఖా మంత్రి - భట్టి విక్రమార్క
మెడికల్ అండ్ హెల్త్ - దామోదర రాజనర్సింహ
ఫౌర సరఫరాలు శాఖా మంత్రి - జూపల్లి కృష్ణ రావు
గిరిజన సంక్షేమం శాఖా మంత్రి - సీతక్క
రోడ్లు భవనాలు శాఖా మంత్రి - తుమ్మల నాగేశ్వరరావు