TS TET Updates : టెట్ లో నార్మలైజేషన్ పై అభ్యర్థుల ఆందోళన, స్పెషల్ టెట్ కోసం సర్వీస్ టీచర్లు డిమాండ్!
TS TET Updates : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడులైంది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే టెట్ నోటిఫికేషన్ లో నార్మలైజేషన్ పై స్పష్టత లేకపోవడం, సర్వీస్ టీచర్ల టెట్ మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
TS TET Updates : తెలంగాణ టెట్ షెడ్యూల్(TS TET Schedule) విడుదలైన సంగతి తెలిసిందే. మే 20 నుంచి జూన్ 3 వరకు 15 రోజుల పాటు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి టెట్ ను కంప్యూట్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో నిర్వహిస్తున్నారు. ఒకే సబ్జెక్టుకు రెండు, మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ సెషన్లలో పేపర్ ఈజీగా, కఠినంగా వచ్చే అవకాశం ఉంటుంది. వివిధ సెషన్లలో నిర్వహించే పరీక్షలకు సాధారణంగా నార్మలైజేషన్ ఉంటుంది. కానీ టెట్ నార్మలైజేషన్ పై నోటిఫికేషన్(TS TET Notification) లో స్పష్టంగా పేర్కొనలేదు. నార్మలైజేషన్ పై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అభ్యర్థులు మాత్రం నార్మలైజేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో టెట్‌ను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించడంతో అభ్యర్థులందరికీ ఒకే పేపర్ ఇచ్చేవారు. ఈ పేపర్ల మూల్యాకనంలో సమస్యలు తలెత్తేవి కాదని అభ్యర్థులు అంటున్నారు. కానీ ఇప్పుడు కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ నిర్వహించడంతో ఒక సెషన్ పేపర్ ఈజీగా, మరో సెషన్ లో కఠినంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ కారణంతో నార్మలైజేషన్ అమలు చేయాలని కోరుతున్నారు.
నార్మలైజేషన్ ఉంటుందా?
జాతీయ స్థాయిలో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలకు సాధారాణంగా నార్మలైజేషన్(Marks Normalization) విధానం అమలువుతుంది. ఏపీ టెట్(AP TET) లోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణ టెట్ లో దీనిపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థుల ఆందోళన చెందుతున్నారు. నార్మలైజేషన్ విధానంలో ఈజీ వచ్చిన పేపర్లను, కఠినంగా వచ్చిన పేపర్లను అంచనా వేసి సరాసరిగా మార్కులు నిర్ణయిస్తారు. ఈ విధానంలో పేపర్ ఈజీగా వచ్చిన వారికి కొన్ని మార్కులు కోత విధించి, పేపర్ కష్టంగా వచ్చిన వారికి కొన్ని మార్కులు అదనంగా కలుపుతారు.
ప్రత్యేక టెట్ కోసం సర్వీస్ టీచర్లు డిమాండ్
టెట్ పరీక్షపై సర్వీస్ టీచర్ల(Teachers) నుంచి మరో డిమాండ్ వినిపిస్తుంది. సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్(TS TET) నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. డీఎస్సీకి(TS DSC 2024) ముందే టెట్ నిర్వహించడంపై బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నా... వీరితో పోటీ పడి టెట్ రాయాలన్న నిబంధనను సర్వీస్ టీచర్లు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఎడ్ , డీఎడ్ అభ్యర్థులతో పోటీ పడి టెట్ రాయాలనడంపై ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. సర్వీస్ టీచర్ల టెట్ కు అవసరమైన మార్గదర్శకాలను ఇంకా ప్రభుత్వం జారీచేయాల్సి ఉంది. టీచర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో విద్యాశాఖ ఈ ప్రక్రియపై సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ టెట్ సిలబస్‌ను మాత్రమే విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణ టెట్ దరఖాస్తులను మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు స్వీకరించనున్నారు. మే 20 నుంచి జూన్ 3 వరకూ టెట్ ను నిర్వహించనున్నారు.
సంబంధిత కథనం