TS Jobs : తెలంగాణ ప్రభుత్వం(TS Govt) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలోని(TS Medical Helath Department Jobs) 5,348 పోస్టుల భర్తీకి అనుమతి తెలిపింది. మార్చిన 16వ తేదీనే ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ పోస్టుల భర్తీకి జీవో విడుదల చేశారు. ప్రజారోగ్యం, ఆయుష్, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు నేరుగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అయితే స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్టర్, అర్హతకు సంబంధించిన వివరాలతో నోటిఫికేషన్ జారీచేయనున్నారు.
రాష్ట్రంలో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 2021 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్న 4356 పోస్టులను కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఈ పోస్టుల భర్తీకి ఇంకా అధికారిక నోటిఫికేషన్(Jobs Notification) రావాల్సి ఉంది.
హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్(Security Printing Press) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 96 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 15వ తేదీతో గడువు ముగియనుంది. ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో(Security Printing Press Hyderabad Recruitment) పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తూ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 96 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా జూనియర్ టెక్నిషియన్(ప్రింటింగ్, కంట్రోల్) 68 ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ మార్చి 15వ తేదీతో ప్రారంభమైంది. ఏప్రిల్ 15వ తేదీతో ఈ గడువు ముగియనుంది. https://spphyderabad.spmcil.com వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తులను సమర్పించవచ్చు.
సంబంధిత కథనం