TS Govt Jobs 2024 : మున్సిపల్ శాఖలో ఉద్యోగాలు - భారీగా వేతనం , అర్హతలివే
HMDA Recruitment 2024: తెలంగాణ మున్సిపల్ శాఖ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా… లీగల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి……
TS Govt Recruitment 2024: తెలంగాణ మున్సిపల్ శాఖ పరిధిలో ఉండే హెచ్ఎండీఏ, మూసీ రివర్ ఫ్రంట్ తో పాటు టీయూఎఫ్ఐడీసీలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. మూడు విభాగాల్లోనూ లీగల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 29వ తేదీలోపు దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు. https://www.nium.org.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి..
ముఖ్య వివరాలు:
రిక్రూట్ మెంట్ ప్రకటన - మున్సిపల్ శాఖ
ఉద్యోగాలు - లీగల్ స్పెషలిస్ట్
మొత్తం ఖాళీలు - 03( HMDA-01, MRDCL -01,TUFIDC-01)
జీతం - నెలకు రూ. 1 లక్ష
అర్హతలు - ఎల్ఎల్ఎం పూర్తి చేయాలి. న్యాయవిభాగంలో 10 ఏళ్ల అనుభవం ఉండాలి. అర్బన్ చట్టాలపై మంచి అవగాహన ఉండాలి,
కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేస్తున్నారు(ఒక ఏడాది). పని తీరు ఆధారంగా పొడిగిస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - ఫిబ్రవరి 29,2024.
షార్ట్ లిస్ట్ అయిన వారిని ఇంటర్వూలకు పిలుస్తారు.
మెయిల్ - hr@nium.org.in.
అధికారిక వెబ్ సైట్ - https://www.nium.org.in/
పీఐబీ హైదరాబాద్ లో ఉద్యోగాలు
పీఐబీ(కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు ట్రాన్స్ లేటర్ పోస్టులను రిక్రూట్ చేయనుంది. ఫిబ్రవరి 23వ తేదీని దరఖాస్తులకు తుది గడువుగా ప్రకటించింది. మెయిల్ లేదా గూగుల్ ఫారమ్ ను నింపి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ముఖ్య వివరాలు:
రిక్రూట్ మెంట్ ప్రకటన - పీఐబీ(కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం.
ఉద్యోగాలు - ఆన్ లైన్ ట్రాన్స్ లేటర్లు, సీనియర్ ట్రాన్స్ లేటర్, సీనియర్ స్పెషలిస్ట్, తెలుగు ల్యాంగ్వేజ్ టైపింగ్
అర్హతలు - డిగ్రీ పూర్తి చేయటంతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
ఆన్ లైన్ ట్రాన్స్ లేటర్లు ఇంటి వద్ద నుంచే వర్క్ చేయవచ్చు. మిగతా వారు ఆఫీస్ లో పని చేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం - దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు.
దరఖాస్తుల స్వీకరణ తుది గడువు - ఫిబ్రవరి 23, 2024.
దరఖాస్తుల నింపేందుకు గూగుల్ ఫారమ్ లింక్ : //forms.gle/B6qW4eg198nfqFzN7
మెయిల్: pibhyderabad@gmail.com
అధికారిక వెబ్ సైట్ - https://pib.gov.in/