TGPSC Group 1 Prelims Key : రేపు టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల, జూన్ 17 వరకు అభ్యంతరాలు స్వీకరణ-hyderabad tgpsc group 1 prelims primary key question paper releases on june 13th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 1 Prelims Key : రేపు టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల, జూన్ 17 వరకు అభ్యంతరాలు స్వీకరణ

TGPSC Group 1 Prelims Key : రేపు టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల, జూన్ 17 వరకు అభ్యంతరాలు స్వీకరణ

Bandaru Satyaprasad HT Telugu
Jun 12, 2024 10:36 PM IST

TGPSC Group 1 Prelims Key : ఈ నెల 9న నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ రేపు విడుదల చేయనున్నారు. ప్రిలిమినరీ కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్ టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

రేపు టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల
రేపు టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల

TGPSC Group 1 Prelims Key : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పై టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్ రేపు(జూన్ 13న) విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. టీజీపీఎస్సీ వెబ్ సైట్ www.tspsc.gov.in లో అభ్యర్థుల లాగిన్ లో ఈ నెల 13 నంచి 17వ తేదీ వరకు ప్రిలిమినరీ కీ, క్వశ్చన్ పేపర్ అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. అలాగే ప్రిలిమనరీ కీ పై అభ్యంతరాలు తెలియజేసేందుకు జూన్ 13 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విండో ఓపెన్ ఉంటుందని అధికారులు తెలిపారు.

అభ్యంతరాల విండో

అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఇంగ్లిష్ లో మాత్రమే సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు తమ క్లెయిమ్‌లను ధృవీకరించేందుకు తగిన ఆధారాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. వెబ్ సైట్ పొందుపరిచిన అభ్యంతరాలను మాత్రమే పరిగణిస్తామని, ఇ-మెయిల్స్, వ్యక్తిగతంగా సమర్పించిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమని కమిషన్ తెలిపింది. చివరి రోజు తర్వాత వచ్చిన అభ్యంతరాలు పరిగణించమని టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని పేర్కొంది.

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్, ఉర్ధూ భాషల్లో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. త్వరలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడనున్నాయి.

మూడు భాషల్లో గ్రూప్-1 మెయిన్స్

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను 21/10/2024 నుంచి 27/10/2024 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మెయిన్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. గ్రూప్-1 మెయిన్స్ లో మొత్తం 06 పేపర్లు ఉంటాయి. వీటిని అభ్యర్థి ముందుగా ఎంచుకున్న మాధ్యమంలోనే రాయాల్సి ఉంటుంది. పేపర్‌లో కొంత భాగాన్ని ఇతర భాషలో రాయడానికి అభ్యర్థికి అనుమతి లేదు. ఇంగ్లిష్ లో కొంత భాగం, తెలుగు లేదా ఉర్దూలో మిగిలిన భాగం రాయడానికి అనుమతి లేదని టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది.

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ ఇదే

గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.

  • జనరల్ ఇంగ్లిష్(క్వాలిఫైయింగ్ పేపర్) - అక్టోబర్ 21
  • పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22
  • పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) - అక్టోబర్ 23
  • పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) - అక్టోబర్ 24
  • పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) - అక్టోబర్ 25
  • పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) - అక్టోబ్ 26
  • పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) - అక్టోబర్ 27

Whats_app_banner

సంబంధిత కథనం