Hyderabad Handicraft Exhibition : హైదరాబాద్ లో చేనేత హస్త కళల ఎగ్జిబిషన్, ఒకే వేదికపైకి దేశంలోని వివిధ కళాకృతులు-hyderabad telangana crafts council handicraft exhibition started ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Handicraft Exhibition : హైదరాబాద్ లో చేనేత హస్త కళల ఎగ్జిబిషన్, ఒకే వేదికపైకి దేశంలోని వివిధ కళాకృతులు

Hyderabad Handicraft Exhibition : హైదరాబాద్ లో చేనేత హస్త కళల ఎగ్జిబిషన్, ఒకే వేదికపైకి దేశంలోని వివిధ కళాకృతులు

Bandaru Satyaprasad HT Telugu
Oct 28, 2023 12:47 PM IST

Hyderabad Handicraft Exhibition : హైదరాబాద్ లో తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హస్త కళల అంగడి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చేనేత, హస్త కళలను ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు క్రాఫ్ట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ సభ్యురాలు సీతారంజిత్ తెలిపారు.

హస్తకళల అంగడి
హస్తకళల అంగడి

Hyderabad Handicraft Exhibition : ఎంతో నైపుణ్యతతో హస్త కళాకృతులు తయారు చేసిన కళాకారులను గుర్తిస్తూ, ఆ కళలను బతికించాల్సిన అవసరం ఉందని టీటీడీ బోర్డు మెంబర్ గడ్డం సీతారంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులను వారి కళలను కాపాడుకుంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం బంజారాహిల్స్ లో తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అంగడి క్రాఫ్ట్స్ కార్యక్రమాన్ని తెలంగాణ హండ్లూమ్స్, టెక్స్టైల్స్ డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ బోర్డు మెంబర్ గడ్డం సీతారంజిత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... నాణ్యత, పనితనం, ధరలు అన్ని చూసి వారి కళను ప్రోత్సహించే విధంగా తమ కౌన్సిల్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ ఎగ్జిబిషన్ లో వారికి ఉచితంగా స్టాల్ ను పెట్టుకునేందుకు అన్ని విధాల సహకరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల కళాకారులకు మరింత ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు.

yearly horoscope entry point

ఒకే వేదికపై అధునాతన డిజైన్లు

భారతీయ సంస్కృతిలో చేనేత వస్త్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని సీతారంజిత్ రెడ్డి అన్నారు. వీటికి మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు క్రాఫ్ట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని చెప్పారు. నేత వస్త్రాలంటే మనలో చాలా మందికి ఆసక్తి ఉంటుoదని వివరించారు. ఆ ఆసక్తిని తీర్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. పదిహేనేళ్లుగా క్రాఫ్ట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ సభ్యురాలిగా కొనసాగుతున్నానని ఆమె పేర్కొన్నారు. పోచంపల్లి, గద్వాల, ఉప్పాడ, బెనారస్‌ వంటి తరాలనాటి వస్త్రాలకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన అధునాతన డిజైన్లను ఒకే వేదికపైకి తెచ్చి విక్రయాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

చేనేత కార్మికులను ఆదుకునే ప్రయత్నం

నేటితరం కూడా చేనేత వస్త్రాలను ధరించి మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడించారు. కొవిడ్‌ సమయంలో ఎంతోమంది చేనేత కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేశామని సీతారంజిత్ రెడ్డి గుర్తుచేశారు. కొయ్యబొమ్మల తయారీ వంటి హస్తకళలకు ఆదరణ కల్పించేందుకు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఎగ్జిబిషన్ రెండు రోజుల పాటు జరుగుతుందని... దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో సీసీటీ ఛైర్మన్ అనురాధ బిస్నొయ్, హేమలత కెంఖా తదితరులు పాల్గొన్నారు.

Whats_app_banner