Ukraine Russia War Hyderabadi Died: అధిక జీతం ఆశచూపి, బలవంతంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలోకి-హైదరాబాద్ యువకుడు మృతి-hyderabad news in telugu youth died in ukraine russian war forced to work ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ukraine Russia War Hyderabadi Died: అధిక జీతం ఆశచూపి, బలవంతంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలోకి-హైదరాబాద్ యువకుడు మృతి

Ukraine Russia War Hyderabadi Died: అధిక జీతం ఆశచూపి, బలవంతంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలోకి-హైదరాబాద్ యువకుడు మృతి

Bandaru Satyaprasad HT Telugu
Mar 06, 2024 10:38 PM IST

Ukraine Russia War Hyderabadi Died : ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. భారత్ కు చెందిన యువకులకు అధిక జీతం ఆశచూపి రష్యాకు తీసుకెళ్లి... బలవంతంగా యుద్ధంలో పాల్గొనే చేస్తున్నారు.

ఉక్రెయిన్,రష్యా యుద్ధంలో హైదరాబాద్ యువకుడు మృతి
ఉక్రెయిన్,రష్యా యుద్ధంలో హైదరాబాద్ యువకుడు మృతి

Ukraine Russia War Hyderabadi Died : అధిక జీతం ఆశచూపి రష్యాకు తీసుకెళ్లి యుద్ధంలో (Ukraine Russia War)పాల్గొనాలని బలవంతం చేసి చివరికి వారి ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు. ఇలాంటి విషాద ఘటన మరొకటి చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు అధిక జీతానికి ఆశపడి రష్యా వెళ్లి ప్రాణాలు(Hyderabad Youth Died) కోల్పోయాడు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో బలవంతంగా పాల్గొనే చేసి చివరికి యువకుడి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. బుధవారం ఎక్స్ లో... మాస్కోలోని భారత రాయబార కార్యాలయం హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అస్ఫాన్ మరణాన్ని ధృవీకరించింది. అయితే అతడు ఏ కారణంగా చనిపోయాడో, రష్యాలో అతడు ఏం చేస్తున్నాడో చెప్పలేదు.

"హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ అస్ఫాన్ విషాద మరణం గురించి మేము తెలుసుకున్నాము. మేము అతడి కుటుంబం, రష్యా అధికారులతో టచ్‌లో ఉన్నాము. అతని పార్థివ దేహాన్ని భారతదేశానికి పంపడానికి రాయబార కార్యాలయం అధికారులు ప్రయత్నాలు చేస్తుంది" అని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ లో పోస్ట్‌ చేసింది.

అధిక జీతం ఆశచూపి

అధిక జీతంతో(More Salary) కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రష్యాకు తీసుకెళ్లిన దాదాపు రెండు డజన్ల మంది భారతీయుల్లో అస్ఫాన్ ఒకరు. అస్ఫాన్ మరణాన్ని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ... అతడి కుటుంబ కుటుంబ సభ్యులతు తెలియజేశారు. తెలంగాణ(Telangana), గుజరాత్, కర్ణాటక, జమ్మూ కశ్మీర్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ఇదే విధంగా మోసపూరితంగా యువకులకు డబ్బు ఆశచూపి రష్యాకు తీసుకెళ్లి యుద్ధంలో పాల్గొనేలా బలవంతం తెలిసిందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. అయితే ఫిబ్రవరి 29న రష్యాలో చిక్కుకున్న 20 మంది భారతీయులు.. భారత అధికారులను సంప్రదించారని, వారిని తిరిగి దేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

మోసం చేసి రష్యాకు తీసుకెళ్లి

రష్యాలో(Russia) చిక్కుకున్న చాలా మంది 'బాబా వ్లాగ్స్'(Baba Vlogs) అనే యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా తన గోడును చెప్పుకుంటున్నారు. దుబాయ్‌కి చెందిన ఏజెంట్ ఫైసల్ ఖాన్ చేతిలో తామంతా మోసపోయి... రష్యాలో చిక్కుకున్నామని వాపోతున్నారు. తమను రక్షించాలని, తిరిగి భారత్ వచ్చేందుకు సాయం చేయాలని కోరుతున్నారు. అబ్దుల్ నయీమ్ అనే యువకుడి తండ్రి... ఫైసల్ ఖాన్ మోసం గురించి చెప్పారు. తన కుమారుడు అబ్దుల్ నయీమ్, అతని ముగ్గురు స్నేహితులు దుబాయ్‌లో పనిచేస్తున్నారన్నారు. వీరితో పరిచయం ఏర్పరచుకున్న ఏజెంట్ ఖాన్‌... రష్యాలో సెక్యూరిటీ గార్డులుగా అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ. 3 లక్షలు తీసుకున్నాడన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో వారిని రష్యాకు తీసుకెళ్లి... ఏవో పత్రాలపై సంతకాలు చేయించి, వారిని మోసగించి యుద్ధంలోకి నెట్టారని అబ్దుల్ నయీమ్ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. వారిని ఉక్రెయిన్ నగరాల్లో ఆర్మీలో పెట్టారన్నారు. వీరిలో కశ్మీర్ కు చెందిన ఓ వ్యక్తి కాలికి బుల్లెట్ గాయమైందన్నారు. వీరిని బలవంతంగా రష్యన్ ఆర్మీ , కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ లో పనిచేయిస్తున్నారని వాపోయారు. తన కొడుకుని రక్షించాలని వేడుకున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం