Case Filed On Santosh Kumar : బంజారాహిల్స్ లో భూమి కబ్జా, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై కేసు నమోదు!
Case Filed On Santosh Kumar : బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. నవయుగ కంపెనీ స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్స్ తో కబ్జా చేశారని ఆ సంస్థ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు.
Case Filed On Santosh Kumar : బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై ఫోర్జరీ కేసు(Forgery Case on Santosh Kumar ) నమోదు అయ్యింది. బంజారాహిల్స్(Banjara Hills) రోడ్ నంబర్ 14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని కబ్జా చేసినట్లు నవయుగ కంపెనీ(Navayuga Group) ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్ల సృష్టించి తమ భూమి కబ్జా చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో స్థలం కబ్జా
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో ఎన్ఈసీఎల్సంస్థకు(NECL) భూమి ఉంది. అయితే ఈ భూమిలో అక్రమంగా చొరబడిన కొందరు రూములు నిర్మించారు. వీటికి ఫోర్జరీ డాక్యుమెంట్లు (Documents Forgery)సృష్టించి సర్వే నంబర్ 129/54లో 1350 చదరపు గజాల స్థలాన్ని కబ్జాకు చేసేందుకు ప్రయత్నించారని చింతా మాధవ్ పోలీసులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రూములకు సంబంధించి మాజీ ఎంపీ సంతోష్ కుమార్(Santosh Kumar) తో పాటు లింగారెడ్డి శ్రీధర్ ట్యాక్స్ కట్టినట్లు గుర్తించామన్నారు. దీంతో వీరిద్దరిపై బంజరాహిల్స్ పోలీసులను కేసు నమోదు చేశారు. సంతోష్ కుమార్ పై 420,468,471,447,120, ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్లు నమోదు చేశారు.
దిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత
ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha) దిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెకు దిల్లీ కోర్టు రిమాండ్ విధించింది. ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15న ఈడీ(ED) హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెను దిల్లీకి తరలించి రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు ముందు వారం రోజుల రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ పూర్తికావడంతో శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. కవితకు మరో మూడు రోజులు రిమాండ్ విధించింది కోర్టు. ఈ కేసులోనే దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది.
చిక్కుల్లో బీఆర్ఎస్ నేతలు
బీఆర్ఎస్ సోషల్ మీడియా(BRS Social Media) కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై ఇటీవల మాదాపూర్ పోలీసులు(Madhapur Police) కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), అతని సోదరుడు తిరుపతిరెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ మన్నె క్రిశాంక్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ పోస్టుపై కాంగ్రెస్ నేతలు ఈ నెల 16న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్(Santosh Kumar) పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman), ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై కూడా కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రుల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో మరికొంత మంది పేర్లు బయటపడతాయని సమాచారం.