TG School Holidays : విద్యార్థులకు మళ్లీ గుడ్‌న్యూస్.. ఈనెల 31న స్కూళ్లకు సెలవు
TG School Holidays : ఈనెల 14వ తేదీ వరకు దసరా సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులకు.. మళ్లీ హాలిడే రానుంది. ఈ నెల 31న అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అక్టోబర్ 21 నుండి 28 వరకు ఎస్ఏ 1 ఎగ్జామ్స్ నిర్వహించేందుకు స్కూళ్లు ఏర్పాట్లు చేస్తున్నాయి.
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. దసరా సెలవులు 13 రోజుల పాటు వచ్చాయి. అక్టోబరు 2న సెలవులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. ఈ హాలిడేస్‌ను ఎంజాయ్ చేసిన విద్యార్థులకు విద్యాశాఖ మళ్లీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 31న కూడా సెలవును ప్రకటించింది.
దసరా సెలవులు తర్వాత.. అక్టోబర్ 31న జరుపుకునే దీపావళి నేపథ్యంలో.. హైదరాబాద్ సహా.. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఉన్న పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరోవైపు అక్టోబర్ 20, 27 ఆదివారాల్లోనూ స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇటు దసరా సెలవులు ముగియగానే.. అక్టోబర్ 21 నుండి 28 వరకు ఎస్ఏ 1 ఎగ్జామ్స్ నిర్వహించేందుకు స్కూళ్లు ఏర్పాట్లు చేస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం మే 25న 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది. జూన్ 12, 2024 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది. 2025, ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల పాటు క్రిస్మస్ సెలవులు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది.
వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. 2025, ఫిబ్రవరి 28లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని హైస్కూల్స్ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగనున్నాయని అధికారులు వివరించారు.
ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూల్స్ పనిచేయనున్నాయి. జూన్ 12, 2024న ప్రారంభమై ఏప్రిల్ 23, 2025తో ముగుస్తాయి. ఏప్రిల్ 24, 2025 నుంచి జూన్ 11, 2025 మొత్తం 49 రోజులు ఈ విద్యాసంవత్సరంలో వేసవి సెలవులు ఉంటాయి.