SSC Paper Leak Case : డిబార్‌ అయిన పదో తరగతి విద్యార్థికి ఊరట.. అధికారులకు హైకోర్టు ఆదేశాలు -high court relief for teen debarred from ssc exams for 5 years in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ssc Paper Leak Case : డిబార్‌ అయిన పదో తరగతి విద్యార్థికి ఊరట.. అధికారులకు హైకోర్టు ఆదేశాలు

SSC Paper Leak Case : డిబార్‌ అయిన పదో తరగతి విద్యార్థికి ఊరట.. అధికారులకు హైకోర్టు ఆదేశాలు

HT Telugu Desk HT Telugu
Apr 08, 2023 05:06 PM IST

TS SSC Exams 2023: టెన్త్‌ పేపర్‌ లీకేజీ ఆరోపణలతో డిబార్‌ అయిన టెన్త్‌ విద్యార్థి హరీష్‌కు ఊరట లభించింది. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

డిబార్ అయిన విద్యార్థికి రిలీఫ్
డిబార్ అయిన విద్యార్థికి రిలీఫ్

Relief for TS SSC Debarred Student: తెలంగాణ పదో తరగతి పేపర్ లీక్ అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. హిందీ పేపర్ లీక్ కేసులో వరంగల్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ పేపర్‌ లీక్‌ చేసిన ఆరోపణలతో హరీష్‌ అనే విద్యార్థిని ఐదేళ్ల పాటు అధికారులు డిబార్‌ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలకు అనుమతి ఇవ్వటం లేదు. ఈ క్రమంలో విద్యార్థి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

పరీక్షలకు అనుమతి ఇవ్వకపోటం, డిబార్ చేయటాన్ని సవాల్ చేస్తూ హరీష్ కుటుంబ సభ్యులు ... హైకోర్టును ఆశ్రయించారు. తన కుమారుడు రీక్ష రాస్తున్న సమయంలో ఎవరో బలవంతంగా పేపర్‌ లాక్కున్నారని తెలిపారు. హిందీ పేపర్ లీక్ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో కూడా తమ కొడుకు పేరు ఎక్కడా లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయినా అధికారులు డిబార్ చేశారని... శుక్రవారం నాటి పరీక్షను రాసేందుకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును రాజకీయాలకు బలి చేశారని పిటిషన్ లో ప్రస్తావించారు. దీనిపై విచారించిన హైకోర్టు..... విద్యార్థికి ఊరటనిచ్చింది. హరీష్ మిగతా పరీక్షలు రాసేలా అనుమతివ్వాలని కోర్టు అధికారులను ఆదేశించింది.

SSC PaperLeak: తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన వ్యవహారంలో విద్యార్థి హరీశ్ ను అధికారులు డిబార్‌ చేశారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సప్‌లో చక్కర్లు కొట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరీక్ష ప్రారంభమైన వెంటనే ప్రశ్నాపత్రాలు వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. ఇందుకు కారకుడిగా అతడిని ఐదేళ్ల పాటు డిబార్ చేశారు.

అయితే తాను ఏ తప్పూ చేయలేదని, తనను అయిదేళ్ల పాటు డిబార్‌ చేయడం అన్యాయమని విద్యార్థి బోరున విలపించాడు. హిందీ ప్రశ్నపత్రాన్ని నిందితుడికి అందజేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హనుమకొండ కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థిపై విద్యాశాఖ అధికారులు వేటు వేశారు. గురువారం కమలాపూర్‌ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆంగ్ల పరీక్ష రాయడానికి వచ్చాడు.పరీక్షరాయడానికి వచ్చిన విద్యార్ధిని హనుమకొండ డీఈవో పిలిచి 'నీ క్వశ్చన్‌ పేపర్‌ మూలంగా ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్‌ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష రాయవద్దంటూ బయటకు పంపారు. పరీక్ష కేంద్రం బయట ఆ విద్యార్థి బోరున విలపించాడు. తన హాల్‌టికెట్ తీసుకొని ఓ పత్రంపై సంతకం చేయించుకున్నారని విద్యార్థి విలపించాడు. బుధవారం ‘పరీక్ష కేంద్రంలో మొదటి ఫ్లోర్‌లో మూడో నంబర్‌ గదిలో కిటికీ దగ్గర కూర్చుని హిందీ పరీక్ష రాస్తుంటే, గోడ మీది నుంచి వచ్చిన ఓ బాలుడు.. ప్రశ్నపత్రం ఇవ్వాలని, బెదిరించాడని వివరించాడు. తాను ఇవ్వకపోయిన కిటికీ నుంచి లాక్కొని సెల్‌ ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నాడని తెలిపాడు.

విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల మేరకు సదరు విద్యార్థిని డిబార్‌ చేస్తున్నట్లు డీఈవో అబ్దుల్‌ హై తెలిపారు. తనకు ఏ పాపం తెలియదని పరీక్షా కేంద్రంలో జవాబు పత్రాన్ని ఫోల్డ్‌ చేసుకుంటా ఉంటే కిటికీ వద్దకు వచ్చిన వ్యక్తి బెదిరించి హిందీ ప్రశ్నపత్రం తీసుకొని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకున్నాడని చెప్పాడు.ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడని విద్యార్ధి వాపోయాడు. కష్టపడి చదివి పరీక్ష రాసేందుకు వస్తే ఎవరో చేసిన తప్పునకు తాను బలయ్యానని కన్నీటి పర్యంతమయ్యాడు. ఎవరో చేసిన తప్పుకు తనకొడుకు జీవితం నాశనమైందని విద్యార్ధి తల్లి వాపోయింది. మంత్రులు, ఉన్నతాధికారులు స్పందించి పరీక్షలు రాసేందుకు తన కొడుకును అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ఆమె వేడుకున్నారు. ఈ క్రమంలోనే హైకోర్టును ఆశ్రయించగా… ఊరట లభించింది.

Whats_app_banner

సంబంధిత కథనం