Harish Rao On Ibrahimpatnam Incident : ఇబ్రహీంపట్నం ఘటన బాధకరం.. ఎప్పుడూ ఇలా జరగలేదు
ఇబ్రహీంపట్నం ఘటనపై మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన తమ దృష్టికి రాగానే అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. అపోలోలో 13 మంది, నిమ్స్ లో 17 మంది ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
ఇబ్రహీంపట్నంలో నలుగురు మహిళలు చనిపోవడంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని చెప్పారు. మిగిలిన వారు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా వీరి ఆరోగ్యంపై సమీక్షిస్తుందన్నారు. రెండు మూడు రోజుల్లో అందరూ డిశ్చార్జి అవుతారని తెలిపారు. ఆరేడు ఏళ్లలో 12 లక్షల ఆపరేషన్లు చేశామని.. ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదని హరీశ్ రావు అన్నారు.
ఈ ఘటన సీరియస్ గా తీసుకున్నామమని హరీశ్ రావు చెప్పారు. సూపరింటెండెంట్ మీద చర్యలు తీసుకున్నామని తెలిపారు. సర్జరీ చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు చేశామన్నారు. విచారణ కమిటీకి ఆదేశించామన్నారు. ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాత్రి, పగలు తేడా లేకుండా బాధితుల ఆరోగ్యంపై పర్యవేక్షిస్తున్నట్టు హరీశ్ రావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : దేశ చరిత్రలో ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్
'ఇప్పుడున్న వారంతా సేఫ్ గా ఉన్నారు. వారికి ఉచిత చికిత్స ఇస్తున్నాం. సహాయకులకు రు. 10 రూపాయలు అందిస్తున్నాం. మేం రాజకీయాలు చేయం. ప్రజల ప్రాణాలు కాపాడాం. రెండు రోజుల తర్వాత వచ్చారు.. మాట్లాడుతున్నారు. ఘటన తెలిసిన నాటి నుంచి ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన కృషి చేస్తున్నాం. ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా అంబులెన్స్ పంపి ఆస్పత్రికి తీసుకొచ్చాం. మా ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడే ఉంటున్నారు. వారిని గంట గంటకు మానిటర్ చేస్తున్నాం. బాధితులకు 5లక్షల పరిహారం అందజేసి.. డబుల్ బెడ్ రూం ఇస్తాం.' అని హరీశ్ రావు అన్నారు.
ఇదీ చదవండి : వెనకబడిన రాష్ట్రాలకు సాయం చేయకుంటే అబివృద్ధి ఉండదు
ప్రతిపక్షాలు ఇవ్వాళ హాస్పిటల్ కి వచ్చి హడావుడి చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. ఇన్ఫెక్షన్ వల్ల మరణించినట్టు ప్రాథమికంగా తెలిసిందని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే మిగిలిన పేషంట్స్ నీ కూడా అపోలో, నిమ్స్ లో చికిత్స అందిస్తున్నామన్నారు. అపోలో 13మంది నిమ్స్ లో 17మంది ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పట్టిందని, రెండు మూడు రోజుల్లో వీరిని డిశ్ఛార్జ్ కూడా చేయనున్నట్టుగా హరీశ్ రావు వెల్లడించారు.