Tragic Accident: మహబూబాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం-four died in a fatal road accident in mahabubabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tragic Accident: మహబూబాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Tragic Accident: మహబూబాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

Sarath chandra.B HT Telugu
Jan 15, 2024 09:53 AM IST

Tragic Accident: సంక్రాంతి పండుగ రోజు మహబూబాబాద్‌‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

రోడ్డు ప్రమాదం నలుగురు దుర్మరణం
రోడ్డు ప్రమాదం నలుగురు దుర్మరణం

Tragic Accident: మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లి శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆటోను కారు ఢీకొట్టడంతో దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న వారు దుర్మరణం పాలయ్యారు.

సంక్రాంతి పండగ ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది. దైవ దర్శనానికి వెళ్లి వస్తున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో ఢీకొనడంతో ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తల్లి , కొడుకు , మనుమడు , మనవరాలు మరణించడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానికంగా కంబాలపల్లి శివారులో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

జిల్లాకు చెందిన కుటుంబం నాగార్జునసాగర్ సమీపంలోని బుడియా బాపు దేవుడిని సందర్శించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నారు. జిల్లాకు చెందిన మరో కుటుంబం గుంజేడులోని ముసలమ్మ దేవతను సందర్శించుకుని కారులో తిరిగి వస్తున్నారు.

ఇంతలో కంబాలపల్లి శివార్లలో కారు-ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇస్లావత్ శ్రీనుతో పాటు అతని తల్లి పాప, కుమారుడు రిత్విక్ ,కుమార్తె రిత్విక అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు.

IPL_Entry_Point