TS Police Jobs : ఫొరెన్సిక్ ల్యాబ్ లో ఉద్యోగాలు.. 40 వేల జీతం, పూర్తి వివరాలివే-forensic lab job notification released by telangana police department full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Forensic Lab Job Notification Released By Telangana Police Department Full Details Are Here

TS Police Jobs : ఫొరెన్సిక్ ల్యాబ్ లో ఉద్యోగాలు.. 40 వేల జీతం, పూర్తి వివరాలివే

Mahendra Maheshwaram HT Telugu
Sep 28, 2022 02:28 PM IST

Forensic Science Laboratory Jobs: ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీస్‌లో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పోలీస్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. 32 పోస్టులకుగాను... దరఖాస్తు విధానం, ఖాళీల వివరాలు, అర్హతల వివరాలను పేర్కొంది.

తెలంగాణలో ఫొరెన్సిక్ ల్యాబ్ ఉద్యోగాలు 2022
తెలంగాణలో ఫొరెన్సిక్ ల్యాబ్ ఉద్యోగాలు 2022 (HT)

Telangana State Forensic Science Laboratory Jobs 2022: తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించిన తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీస్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మొత్తం 32 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. ఒక సంవత్సరం వ్యవధికి మాత్రమే హైదరాబాద్ సిటీ పరిధిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

అభ్యర్థులు సెప్టెంబర్ 19, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య నిర్ణీత ప్రొఫార్మాలో అప్లయ్ చేసుకోవాలి. పూర్తి సమాచారం కొరకు www.tspolice.gov.in వెబ్ సైట్ తనిఖీ చేయవచ్చు. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 19న విడుదల చేశారు.

ఉద్యోగ ఖాళీల వివరాలు:

సైంటిఫిక్ ఆఫీస్( DNA) -02

సైంటిఫిక్ అసిస్టెంట్ ( DNA) - 04

ల్యాబ్ అసిస్టెంట్ ( DNA) -02

సైంటిఫిక్ ఆఫీసర్ (బయాలజికల్ డివిజన్) -03

సైంటిఫిక్ అసిస్టెంట్(బయాలజికల్ డివిజన్) -03

ల్యాబ్ అసిస్టెంట్ (బయాలజి డివిజన్) -04

సైంటిఫిక్ ఆఫీసర్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) -02

సైంటిఫిక్ అసిస్టెంట్(సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) -06

ల్యాబ్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) - 02

సైంటిఫిక్ అసిస్టెంట్(కెమికల్ డివిజన్) - 04

అర్హతలు..

పోస్టులను బట్టి అర్హతలను నిర్ణయించారు. బయాలజీతో ఎంఎస్సీ, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో 65 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి. బయాలజీ లేదా జువాలజీ లేదా బయో టెక్నాలజీ లేదా మైక్రోబయాలజీ , బోటనీ లేదా జెనెటిక్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా అర్హులుగా పేర్కొన్నారు.సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కంప్యూటర్ సబ్జెక్టుగా డిగ్రీగా ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చ

ఫీజు వివరాలు..

సైంటిఫిక్ ఆఫీసర్ , సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించారు. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి)

ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200చెల్లించాలి.

నిర్ణీత రుసుంతో తీసిన డ్రాఫ్ట్ లను “Director Forensic Science Lab, Hyderabad” పేరుతో తీయాలి. ఆయా దరఖాస్తులను అక్టోబర్ 10, 2022 సాయంత్రం 5 గంటల లోగా పంపించాలి. విద్యార్హత సర్టిఫికెట్లను అప్లికేషన్ ఫారమ్ తో జత చేసి.. The Director, Telangana State Forensic Laboratories Red Hills, Nampally, Hyderabad – 004 అడ్రస్ కు పంపించాలి. ఎన్వలప్ కవర్ పై APPLICATION FOR THE POST OF (NAME OF THE POST& POST CODE)ఈ ఫార్మాట్ లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం 30 నుంచి 40 వేల మధ్య ఉంటుంది.

ఎంపిక విధానం..

దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి.. రాత పరీక్ష, ఇంటర్వూ ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేస్తారు.

రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మరిన్ని వివరాలకు www.tspolice.gov.in వెబ్ సైట్ సదర్శించి తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు.

IPL_Entry_Point