TSFSL Jobs 2022: ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు… పోలీసుశాఖ ప్రకటన-telangana state forensic science laboratory jobs notification 2022 released full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsfsl Jobs 2022: ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు… పోలీసుశాఖ ప్రకటన

TSFSL Jobs 2022: ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు… పోలీసుశాఖ ప్రకటన

HT Telugu Desk HT Telugu
Sep 16, 2022 02:26 PM IST

Forensic Science Laboratory Jobs: తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 10వ తేదీతో ముగియనుంది.

<p>టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో &nbsp;ఉద్యోగాలు</p>
టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఉద్యోగాలు (tsfsl.in)

Telangana State Forensic Science Laboratory Jobs 2022: తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈనెల 19 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. అక్టోబరు 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ మేరకు ఖాళీల వివరాలను వెల్లడించింది.కాంట్రాక్టు పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. . ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది.

ఉద్యోగ ఖాళీల వివరాలు:

సైంటిఫిక్ ఆఫీస్( DNA) -02

సైంటిఫిక్ అసిస్టెంట్ ( DNA) - 04

ల్యాబ్ అసిస్టెంట్ ( DNA) -02

సైంటిఫిక్ ఆఫీసర్ (బయాలజికల్ డివిజన్) -03

సైంటిఫిక్ అసిస్టెంట్(బయాలజికల్ డివిజన్) -03

ల్యాబ్ అసిస్టెంట్ (బయాలజి డివిజన్) -04

సైంటిఫిక్ ఆఫీసర్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) -02

సైంటిఫిక్ అసిస్టెంట్(సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) -06

ల్యాబ్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) - 02

సైంటిఫిక్ అసిస్టెంట్(కెమికల్ డివిజన్) - 04

మరిన్ని వివరాల కోసం https://www.tspolice.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ఫోన్ నెంబర్లు - 040 - 29394449, 040- 233307138

ఇమెయిల్ - itcellfsl@gmail.com

Whats_app_banner