Ex Minister Mallareddy : భూకబ్జాపై ఫిర్యాదు... మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
FIR On Ex Minister Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. భూకబ్జాపై అందిన ఫిర్యాదు మేరకు… శామీర్పేట్ పోలీస్స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
FIR On Ex Minister Mallareddy : మాజీ మంత్రి,మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 47 ఎకరాల భూమిని కబ్జా చేశారని అందిన ఫిర్యాదు మేరకు… శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు మరో తొమ్మిది మందిపై 420 సెక్షన్ తో పాటు పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయ్యింది.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమి ఉంది. దీన్ని మల్లారెడ్డి కబ్జా చేశారని శామీర్పేట పోలీస్ స్టేషన్ లో కేతావత్ భిక్షపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. మల్లారెడ్డితో పాటు పలువురి పేర్లను కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈమేరకు భూకబ్జాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
గత ప్రభుత్వంలో… కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు మల్లారెడ్డి. మంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయనపై పలు భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. అయితే వాటిని కొట్టిపారేశారు మల్లారెడ్డి. ఇక ఈసారి కూడా మేడ్చల్ నుంచి పోటీ చేసిన ఆయన…. ఎమ్మెల్యేగా గెలిచారు.