
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు వార్తలు బయటికి వచ్చాయి. మెడికల్ సీట్ల విషయంలో విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ సోదాల వార్తలను మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి కొటిపారేశారు.



