Case On KTR: కేటీఆర్‌పై వరంగల్‌లో కేసు నమోదు, కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో జీరో ఎఫ్‌ఐఆర్ కేసు రిజిస్ట్రేషన్-case registered against ktr in warangal zero fir case registered on complaint of congress leaders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Case Registered Against Ktr In Warangal, Zero Fir Case Registered On Complaint Of Congress Leaders

Case On KTR: కేటీఆర్‌పై వరంగల్‌లో కేసు నమోదు, కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో జీరో ఎఫ్‌ఐఆర్ కేసు రిజిస్ట్రేషన్

HT Telugu Desk HT Telugu
Mar 29, 2024 05:36 AM IST

Case On KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై వరంగల్ నగరంలో కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో కేటీఆర్‌‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు, కేసు నమోదు
కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు, కేసు నమోదు

Case On KTR: సీఎం రేవంత్ రెడ్డి Revanth Reddyపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయనను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ Congress నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి కేటీఆర్‌‌ KTRపై హనుమకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై వరంగల్ నగరంలో కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి Revanthపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయనను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనుమకొండ Hanmakonda పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

ఈ మేరకు హనుమకొండ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్ట్ చేసి, అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వరంగల్ కాంగ్రెస్ నేతలు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గురువారం కాంగ్రెస్ పార్టీ నేతలు హనుమకొండ సీఐ సతీశ్ కు కంప్లైంట్ Police Complaint చేశారు.

మూడు రోజుల నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంట పీసీసీ మెంబర్ బత్తిని శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సీఐ సతీశ్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా బత్తిని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ దగ్గర, బిల్డర్స్ దగ్గర వసూలు చేసి ఢిల్లీకి పంపించాడని కేటీఆర్ లేనిపోని అబద్దాలు మాట్లాడుతున్నాడని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వ్యక్తిగతంగా మాట్లాడుతూ పరువు, బాధ్యతలకు కూడా భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నాడన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి లోక్ సభ ఎన్నికల తరువాత భారతీయ జనత పార్టీలోకి వెళ్తాడని, ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడటంతో పాటు తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా కేటీఆర్ కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడంతో పాటు రేవంత్ రెడ్డి వ్యక్తిగత పరువు, ప్రతిష్టకు భంగం కలిగించినందు వల్ల కేసీఆర్ పై కేసు నమోదు చేయాల్సిందిగా బత్తిని శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఇలాగే కొనసాగితే వారి పార్టీ గుర్తింపు రద్దుకు ఎలక్షన్ కమిషన్ ను కలిసి విన్నవిస్తామని స్పష్టం చేశారు.

2,500 కోట్లు దిల్లీకి పంపారు: కేటీఆర్

మున్సిపల్‌ శాఖను తన వద్దనే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి మూడు నెలలుగా డబ్బులిస్తేనే బిల్డింగులకు పర్మిషన్లు మంజూరు చేస్తున్నారని, అలా వసూలు చేసిన రూ.2,500 కోట్లను దిల్లీకి పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో మూడు రోజుల కిందట సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఓవైపు ఇసుక దందా, రైస్‌ మిల్లర్లు, మరోవైపు బిల్డర్లు, రియల్టర్లను బెదిరిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారని, జేబు దొంగలా కత్తెర జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడరి సెటైర్లు వేశారు.

పేగులు తెంపి మెడలో వేసుకుంటా అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్‌కు సీఎంగా పనిచేసే తెలివి లేదని కేటీఆర్ విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌, స్కామ్‌ల పేరు చెప్పి, ఆ వార్తలే మీడియాలో రాయించుకుంటున్నారని, పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరే తొలి వ్యక్తి రేవంత్ రెడ్డేనంటూ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.

ఈ ఆరోపణపై ఎందుకు స్పందించడం లేదని కూడా సమావేశం వేదికగా ప్రశ్నించారు. జీవితమంతా కాంగ్రెస్ లోనే ఉంటానని రేవంత్‌ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని, బీజేపీలో చేరడం నిజం కాబట్టే నోరు మెదపడం లేదని కూడా ఆరోపించారు.

ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం పరువు, బాధ్యతలకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నాడంటూ కాంగ్రెస్ నేతలు హనుమకొండ పీఎస్ లో ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

IPL_Entry_Point

సంబంధిత కథనం