Crime: మారేడ్‌పల్లి సీఐపై కిడ్నాప్, అత్యాచారం కేసు.. విధుల నుంచి సస్పెండ్-case filed against marredpally ci nageswara rao over sexual harassment and kidnap case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Case Filed Against Marredpally Ci Nageswara Rao Over Sexual Harassment And Kidnap Case

Crime: మారేడ్‌పల్లి సీఐపై కిడ్నాప్, అత్యాచారం కేసు.. విధుల నుంచి సస్పెండ్

HT Telugu Desk HT Telugu
Jul 09, 2022 02:48 PM IST

Police case on marredpally ci: హైదరాబాద్ నగరంలో మారేడ్ పల్లి సీఐగా పని చేస్తున్న నాగేశ్వర్ రావుపై కేసు నమోదైంది. కిడ్నాప్, అత్యాచారం చేసినట్లు ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

మారేడ్ పల్లి సీఐపై కేసు
మారేడ్ పల్లి సీఐపై కేసు

case filed against marredpally ci: నగరానికి చెందిన మారేడ్ పల్లి సీఐ వివాదంలో చిక్కుకున్నారు. మహిళపై అత్యాచారం, కిడ్నాప్‌ ఆరోపణలతో నాగేశ్వర్‌రావుపై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నాగేశ్వర్‌రావు ఓ వివాహితను కిడ్నాప్ చేసి ఆఘాయిత్యానికి పాల్పడి ఆమె భర్తపైనా దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితురాలు, ఆమె భర్తను కారులో బలవంతంగా తీసుకువెళ్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద కారు ప్రమాదానికి గురికావడంతో తప్పించుకున్న బాధితులు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సీఐపై అత్యాచారం కేసు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

పోలీసుల వివరాల ప్రకారం....

2018లో బాధితురాలి భర్తపై ఓ కేసు నమోదైంది. ఈ కేసును టాస్క్ ఫోర్స్ సీఐగా ఉన్న నాగేశ్వర్ రావు దర్యాప్తు చేపట్టారు. అనంతరం బాధితురాలి భర్తను వ్యవసాయ పనుల్లో చేర్చుకున్నాడు. నెల వారీగా జీతం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు భర్తకు తెలియకుండా భార్యను వ్యవసాయ క్షేత్రానికి బలవంతంగా తీసుకువచ్చాడు నాగేశ్వరరావు. ఇదే విషయాన్ని తన భర్తకు చెప్పింది బాధితురాలు. ఈ క్రమంలో నాగేశ్వర్ రావుకు ఫోన్ చేసిన భర్త.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన సీఐ నాగేశ్వరరావు.. వెంటనే బాధితురాలి ఇంటికి ఎస్ఐ, కానిస్టేబుళ్లను పంపాడు.ఆమె భర్తను తీసుకువచ్చి గంజాయి చేతిలో పెట్టి ఫొటోలు, వీడియోలు తీయించాడు. తన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబితే... గంజాయి కేసు నమోదు చేస్తానని భార్య, భర్తలను బెదిరించాడు.

06- 07 -2022వ తేదీన బాధితురాలికి వాట్సాప్ కాల్ చేశాడు సీఐ నాగేశ్వరరావు. భర్త సొంత గ్రామంలో ఉన్నట్లు తెలుసని, తన కోరిక తీర్చాలని బెదిరించాడు. ఈ విషయం తెలిసిన భర్త వెంటనే భార్య నివాసం ఉంటున్న హస్తినపురానికి బయల్దేరాడు. 07 -07 -2022 రోజున రాత్రి 09.30 గంటల సమయంలో సీఐ నాగేశ్వరరావు... బాధితురాలి ఇంటికి చేరుకున్నాడు. ఆమె పై దాడి చేయడమే కాకుండా లైంగిక కోరిక తీర్చుకున్నాడు. ఇదే సమయంలో భర్త ఇంటికి చేరుకోగా..తలపులను బద్ధలుకొట్టి, నాగేశ్వర్ రావుపై కర్రతో దాడి చేశాడు. ఈ క్రమలో నాగేశ్వర్ రావు తన వద్ద ఉన్న రివాల్వర్ తో బెదిరించాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని, నిర్మానుష ప్రాంతంలో వ్యభిచారం కింద కేసు నమోదు చేస్తానని హెచ్చరించాడు. ఇదే సమయంలో తన వద్ద ఉన్న ఆయుధాలతో బెదిరించి వారిద్దరిని కారులో ఎక్కించుకుని ఇబ్రహీంపట్నం వైపు తీసుకెళ్లాడు. దారి మధ్యలో వాహనం ప్రమాదానికి గురి కావటంతో... భర్త, భార్య తప్పించుకున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు.

పలు సెక్షన్ల కింద కేసు...

బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ నాగేశ్వర్ రావు పై ఐపీసీ 307, 365, 448, 452, 376(2), ఆయుధాల చట్టంలోని సెక్షన్ 30 కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతానికి సీఐ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

విధుల నుంచి సస్పెండ్....

సీఐ వ్యవహరంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చర్యలు చేపట్టారు. అత్యాచారం, ఆయుధ చట్టం కింద కేసులు నమోదైన నేపథ్యంలో నాగేశ్వర్‌రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

IPL_Entry_Point