BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - దరఖాస్తుల గడువు పొడిగింపు-ambedkar open university admission registration date extended to 31st august 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Braou Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - దరఖాస్తుల గడువు పొడిగింపు

BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - దరఖాస్తుల గడువు పొడిగింపు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 24, 2024 05:18 AM IST

Ambedkar Open University Admissions 2024: డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలకు సంబంధించి డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ మరో అప్డేట్ ఇచ్చింది. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును ఆగస్టు 31వ తేదీకి పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ప్రవేశాలు
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ప్రవేశాలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీ నుంచి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆగస్టు 18వ తేదీతో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు పూర్తి కావటంతో అధికారులు గడువు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

దూర విద్యా ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్‌, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. www.braouonline.in, www.braou.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను చెక్ చేసుకోవచ్చు.

కోర్సులు ఇవే...

డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు ఉన్నాయి. ఇక పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులను పేర్కొంది. ఇందులో అడ్మిషన్లు పొందేందుకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ .. ఆగస్టు 31,2024 తేదీతో ముగియనుంది. ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో అధికారులు పేర్కొన్నారు. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ద్వారా చెల్లించవచ్చు.

అర్హతలు...

అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ - తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ - ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు..

- దరఖాస్తులు ప్రారంభం - 27 -జులై-2024.

- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.ఆగస్టు,2024.

- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

- అధికారిక వెబ్ సైట్ - https://www.braouonline.in/

- అప్లికేషన్ లింక్ - https://online.braou.ac.in/PG/PGFirstHome

ఆయా కోర్సులను బట్టి ఫీజులను ఖరారు చేశారు. అధికారిక సైట్ లో ఆ వివరాలను కూడా పొందుపరిచారు. జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 సంప్రదించవచ్చు.

ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు:

ఈ విద్యా సంవత్సరాని(2024 -25)కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విభాగం కీలక అప్డేట్ ఇచ్చింది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు(ఫస్ట్ ఫేజ్) దరఖాస్తులు కోరుతూ ఇటీవలే నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తోంది. ఆగస్టు 16 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http://oupgrrcde.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • యూనివర్శిటీ - ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, ఉస్మానియా వర్శిటీ
  • కోర్సుల వివరాలు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, పీజీ డిప్లొమా కోర్సులు.
  • కోర్సుల వ్యవధి: ఆయా కోర్సులను అనుసరించి ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది. డిప్లోమా కోర్సుల వ్యవధి సంవత్సరం.
  • మీడియం : కొన్ని కోర్సులు తెలుగు మీడియంలో, మరికొన్ని ఇంగ్లీష్ మీడియాలో ఉన్నాయి.
  • సెమిస్టర్ విధానంలో పరీక్షలు ఉంటాయి.
  • అర్హత: కోర్సులను అనుసరించి ఇంటర్మీడియట్‌ (10+2) / తత్సమాన, గ్రాడ్యుయేషన్, బీకాం, టీఎస్‌ ఐసెట్‌/ ఏపీఐసెట్‌ ఎంట్రెన్స్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - ఆగస్టు 16, 2024.
  • అధికారిక వెబ్ సైట్ - http://www.oucde.net/