NEET PG Result 2024 : ఇంకొన్ని రోజుల్లో నీట్ పీజీ ఫలితాలు విడుదల- ఇలా చెక్ చేసుకోండి..
NEET PG Results date : నీట్ పీజీ ఫలితాలు 2024 natboard.edu.in విడుదల కానున్నాయి. ఆగస్టు 11న జరిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కులతో కూడిన పీడీఎఫ్‌ని ఎలా చెక్ చేసుకోవాలి? ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి..
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్ పీజీ 2024) ఫలితాలు ఇంకొన్ని రోజుల్లో విడుదలవుతాయని సమాచారం. నీట్ పీజీ రాసిన అభ్యర్థులు natboard.edu.in, nbe.edu.in అధికారిక వెబ్‌సైట్స్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఆగస్టు 11న జరిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కులతో కూడిన పీడీఎఫ్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. నీట్ పీజీ ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే వ్యక్తిగత స్కోర్‌కార్డులు విడుదలవుతాయని అభ్యర్థులు గమనించాలి. ఫలితాలతో పాటు నీట్ పీజీ కటాఫ్ మార్కులను కూడా ఎన్బీఈఎంఎస్ ప్రకటిస్తుంది.
నీట్ పీజీ ఫలితాలు 2024 ఎలా చెక్ చేసి డోన్లోడ్ చేసుకోవాలి?
నీట్ పీజీ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఇలా చేయండి..
స్టెప్ 1: nbe.edu.in లేదా natboard.edu.in అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
స్టెప్ 2: హోమ్ పేజీలోని 'నీట్ పీజీ' లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: నీట్ పజీ ఫలితాలు 2024పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: నీట్ పీజ ఫలితాలను ప్రదర్శించే కొత్త విండో ఓపెన్ అవుతుంది.
స్టెప్ 5: మీ పేరు లేదా రోల్ నంబర్ ఉపయోగించి జాబితాలో మీ ఫలితాన్ని చెక్ చసుకోండి.
స్టెప్ 6: పీడీఎఫ్‌ని సేవ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
“ఒకటి కంటే ఎక్కువ షిఫ్ట్స్‌లో వివిధ పరీక్షల కోసం దిల్లీ ఎయిమ్స్ అవలంభిస్తున్న పక్రియను నీట్ పీజీ 2024 ఫలితాలను రూపొందించేందుకు ఉపయోగిస్తున్నాము,” అని ఎన్బీఈఎంఎస్ ఓ ప్రకనటలో తెలిపింది.
ఈ నెలలో జరిగిన నీట్ పీజీ పరీక్షకు 31 రాష్ట్రాల్లోని 170 నగరాల్లోని 416 కేంద్రాల్లో మొత్తం 2,16,136 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండు షిఫ్టుల్లో పరీక్షను నిర్వహించారు.
మొదటిది ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించారు.
26,699 డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎండీ), 922 పీజీ డిప్లొమా సీట్లు ఉన్నాయి.
వాస్తవానికి ఈ పరీక్ష జూన్‌లోనే జరగాల్సి ఉంది. కానీ నీట్ యూజీ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో నీట్ పీజీని వాయిదా వేశారు. చివరికి ఆగస్ట్‌లో నిర్వహించారు.
సంబంధిత కథనం