UGC Fake Universities List : ఏపీలో రెండు ఫేక్ యూనివర్సిటీలు, దేశవ్యాప్తంగా 21 - యూజీసీ ప్రకటన
UGC Fake Universities List : దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. వీటిల్లో అత్యధికంగా దిల్లీలో 8 ఫేక్ వర్సిటీలు ఉండగా, ఏపీలో రెండు ఉన్నట్లు గుర్తించింది. ఈ యూనివర్సిటీలు ప్రదానం చేసే డిగ్రీలు చెల్లుబాటు కావని యూజీసీ ప్రకటించింది.
ఏపీలో రెండు ఫేక్ యూనివర్సిటీలు, దేశవ్యాప్తంగా 21 - యూజీసీ ప్రకటన
UGC Fake Universities List : దేశ వ్యాప్తంగా 21 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయని యూజీసీ ప్రకటించింది. ఈ ఏడాది మే నాటికి దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. ఈ వర్సిటీలు జారీ చేసే డిగ్రీలు చెల్లుబాటు కావని తెలిపింది. వీటిని డిగ్రీలు ప్రదానం చేసే అధికారంలేదని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫేక్ వర్సిటీలు డిగ్రీలు ప్రదానం చేసినా వాటిని విద్య, ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించమని స్పష్టం చేసింది. నకిలీ వర్సిటీల్లో దిల్లీల్లో అత్యధికంగా 8 ఉండగా, ఉత్తర్ ప్రదేశ్ లో నాలుగు, ఏపీ, కేరళ, పశ్చిమబెంగాల్ లో రెండు ఉన్నాయి. కర్ణాటక,పుదుచ్చేరి, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున ఫేక్ వర్సిటీలు ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా
ఆంధ్రప్రదేశ్
- క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, కాకుమానువారి తోట, గుంటూరు
- ఆంధ్ర ప్రదేశ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం
దిల్లీ
- దిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ & ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPHS) విశ్వవిద్యాలయం
- దిల్లీ కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దర్యాగంజ్
- దిల్లీ ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం
- దిల్లీ వొకేషనల్ యూనివర్సిటీ
- దిల్లీ ADR-సెంట్రిక్ జ్యురిడికల్ యూనివర్సిటీ
- దిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
- దిల్లీ విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్
- దిల్లీ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం
కర్ణాటక
- కర్ణాటక బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ
కేరళ
- సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం, కేరళ
- కేరళ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్ (IIUPM)
మహారాష్ట్ర
- మహారాష్ట్ర రాజా అరబిక్ విశ్వవిద్యాలయం
పుదుచ్చేరి
- శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, పుదుచ్చేరి
ఉత్తర్ ప్రదేశ్
- గాంధీ హిందీ విద్యాపీఠం
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ)
- భారతీయ శిక్షా పరిషత్
- మహామాయ సాంకేతిక విశ్వవిద్యాలయం
పశ్చిమ బెంగాల్
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్కత్తా
- పశ్చిమ బెంగాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్
సంబంధిత కథనం