Adilabad Ethanol Protest: ఇథనాల్ పరిశ్రమ రద్దు కోసం 100రోజులుగా దీక్షలు
Adilabad Ethanol Protest: ఆదిలాబాద్ దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య నెలకొల్పనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ మా కొద్దు అని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తూ, ఆయా గ్రామాల రైతులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి నేటికీ వందరోజులు కావొస్తుంది.
Adilabad Ethanol Protest: తమ ప్రాంతంలో ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ మండల ప్రజలు గత వంద రోజులుగా వివిధ రకాల నిరసనలు, ఆందోళన లు కొనసాగిస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పటికి గ్రామస్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కలిసి సమస్యను వివరించారు. ప్రజారోగ్యన్ని దెబ్బతీసే పరిశ్రమను ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏర్పాటు చేయడం భావ్యం కాదని, వ్యవసాయం పని ఆధారపడి ఉన్న ఈ ప్రాంతంలో రైతులకు జీవనోపాధి లేకుండా ఫ్యాక్టరీ నిర్మించడం సమంజసం కాదని హెచ్చరిస్తున్నారు.
గత శాసనసభ ఎన్నికలకు ముందు ప్రస్తుత పాలకులు , ఎన్నో హామీలు ఇచ్చి నిర్మాణ పనులు నిలిపివేసి, కొద్దిరోజులుగా మళ్లీ తిరిగి ప్రారంభించడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇతనాల్ పరిశ్రమ ఏర్పాటైతే భావితరాలకు ఇబ్బందులు తప్పవని మండలం లోని ప్రతీ రైతు దీక్షలో పాల్గొని 100రోజులుగా నిరసన చేస్తున్నారు
గతంలో నిర్మాణ పనులకు నిప్పు..
గతంలో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే . పంట పొలాలను కలుషితం చేసే ఈ పరిశ్రమను తరలించాలంటూ గుండంపెల్లి, దిలావర్‌పూర్, న్యూలోలం, సముందర్‌పెల్లి గ్రామాలకు చెందిన దాదాపు 10 వేల మంది రైతులు, ప్రజలు ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టి, పరిశ్రమల లోపలికి చొచ్చుకెళ్లి గోడలు, సామగ్రి, షెడ్లను కూల్చివేసి టిప్పర్ల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడున్న స్కార్పియో వాహనాన్ని బోల్తా పడేసి నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఫ్యాక్టరీ లోపలికి మహిళలు వస్తుండగా, పోలీసులు అడ్డుకొని బాష్పవాయువు ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు.
వంద రోజులుగా ఎన్నో బుజ్జగింపులు..
తమ ప్రాంతంలో ఇథనాల్ పరిశ్రమలు నెలకొల్ప రాదని గత వంద రోజులుగా రైతులు వివిధ రకాల నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పటికీ ముగ్గురు జిల్లా కలెక్టర్లు గ్రామానికి వెళ్లి గ్రామస్థులతో తీవ్ర చర్చలు జరిపారు అయినప్పటికీ శశి మేరా అని రైతులు భీష్మంచి కూర్చుంటున్నారు. పరిశ్రమ రావడంతో స్థానిక రైతులకు లాభమేగాని నష్టం లేదని చెప్పినప్పటికీ లేదని చెప్పినప్పటికీ రైతులు వినడం లేదు. పరిశ్రమకు సంబంధించిన నిర్వాహకులతో వివిధ శాఖల అధికారులతో మచ్చ చెప్పిన ఫలితం లేకుండా పోయింది.
అన్నదాతలకు నెలకొన్న సమస్యల పట్ల అనుమానాలను అధికారులు నివృత్తి చేయలేకపోయారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వలన ఆహార కొరత ఏర్పడుతుందని, ఇథనాల్ ఉత్పత్తికి బియ్యం, మొక్కజొన్న అవసరం అవుతుందని, ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి సుమారు రెండు కిలోల బియ్యం అవసరం అవుతుందని, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, అక్రమ మార్గంలో అనుమతులు పొందారని పేర్కొన్నారనే ప్రశ్నలకు అధికారులు చెప్పే సమాధానం సరిపోవడం లేదు. ఈ కారణం గానే సుమారు రెండు ఏళ్లుగా పరిశ్రమ పనులు నిలిచి పోయాయి.
వెంటనే రద్దు చేయాలి.... రైతులు….
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుతో భవిష్యత్తులో తమకు పూర్తిగా అంధకారమేనని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకొని వీలైనంత త్వరగా పరిశ్రమను నిలిపేయాలంటూ ఆందోళనలను తీవ్రతరం చేశారు. లేకపోతే పరిశ్రమ మూసే వరకు తమ పోరాటాలను ఉద్ధృతం చేస్తామని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఫ్యాక్టరీని రద్దు చేయాలని కోరారు. కాగా దిలావర్పూర్ మండల కేంద్రంలో స్వచ్ఛందంగా వ్యాపారులు బంద్ పాటించి రైతులు సభలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో , తెలంగాణ విద్యావంతులు, పర్యావరణ వేత్తలు, న్యాయవాదులు అల్లూరి మల్లారెడ్డి, వినాయక్ రెడ్డి, సారంగాపూర్ మాజీ జెడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి తదితరులు ముందుండి మద్దతుగా నిలుస్తున్నారు.
(రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్ల ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)