Team India's Last ICC Trophy : భారత్ ఐసీసీ ట్రోఫీని గెలిచి 10 ఏళ్లు కంప్లీట్
Team India's Last ICC Trophy : మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమ్ ఇండియా జూన్ 23, 2013న ఇంగ్లండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అంటే జూన్ 24కు ఐసీసీ ట్రోఫీ గెలిచి పదేళ్లు పూర్తయిందన్నమాట.
మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమ్ ఇండియా(Team India) జూన్ 23, 2013న ఇంగ్లండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్(England)ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ధోనీ తన పేరిట ప్రత్యేక రికార్డును కూడా సృష్టించాడు. అంటే, ధోనీ తన నాయకత్వంలో మూడు ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)లను భారత్ ఒడిలో పెట్టాడు. అతడు 3 వేర్వేరు ICC ట్రోఫీలను గెలుచుకున్న మొదటి కెప్టెన్‌గా కూడా నిలిచాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విషయానికొస్తే, ఆ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) అద్భుత ప్రదర్శన ఇప్పటికీ క్రికెట్ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
2013 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, ధోనీ నాయకత్వంలో, టీమ్ ఇండియా 2011లో వన్డే ప్రపంచకప్‌ను, 4 సంవత్సరాల ముందు 2007లో తొలిసారిగా టీ20 ప్రపంచకప్(T20 World Cup)ను కైవసం చేసుకుంది. భారత్ చివరిసారిగా ఐసీసీ ట్రోఫీని గెలుచుకుని సరిగ్గా 10 ఏళ్లు పూర్తయ్యాయి. చాలా సార్లు ఐసీసీ ట్రోఫీని గెలుపొందేందుకు చేరువగా వచ్చి వెనక్కు వచ్చింది భారత్. అంతకుముందు 2017లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఆఖరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఓడిపోయింది.
ఇటీవలే రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్సీలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడారు. అయితే టైటిల్ గెలవాలన్న కలలకు ఆస్ట్రేలియా బ్రేక్ వేసింది. అంతకుముందు 2021లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ WTC ఫైనల్‌లో ఆడింది. అయితే ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఓడిపోయింది. ఈ 10 సంవత్సరాలలో భారతదేశం మొత్తం 4 సార్లు ICC టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకుని విఫలమైంది.
ఈ ఏడాది స్వదేశంలో ఐసీసీ ట్రోఫీ కరువును ముగించే అవకాశం భారత్‌కు ఇప్పుడు ఉంది. అక్టోబరు-నవంబర్‌లో భారత్‌లో ప్రపంచకప్ జరగనుండగా, స్వదేశంలో ప్రపంచకప్ జరుగుతున్నందున, దీనిని సద్వినియోగం చేసుకుని టీమ్ ఇండియా ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
టాపిక్