Apple credit card: భారత్ లో క్రెడిట్ కార్డ్ ను లాంచ్ చేయనున్న యాపిల్ సంస్థ; హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తో చర్చలు
Apple credit card: భారత్ లో తొలిసారి తమ క్రెడిట్ కార్డును లాంచ్ చేయాలని యాపిల్ (Apple) సంస్థ నిర్ణయించింది. భారత్ లోని ఫైనాన్షియల్ మార్కెట్ లో అడుగుపెట్టడానికి నిర్ణయించుకున్న యాపిల్.. తమ క్రెడిట్ కార్డ్ లాంచ్ కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తో చర్చలు జరుపుతోంది.
Apple credit card: భారత్ లో తొలిసారి తమ క్రెడిట్ కార్డు (credit card)ను లాంచ్ చేయాలని యాపిల్ (Apple) సంస్థ నిర్ణయించింది. భారత్ లోని ఫైనాన్షియల్ మార్కెట్ లో అడుగుపెట్టడానికి నిర్ణయించుకున్న యాపిల్.. తమ క్రెడిట్ కార్డ్ లాంచ్ కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తో చర్చలు జరుపుతోంది.
Apple credit card: యాపిల్ కార్డ్
యాపిల్ కార్డ్ (Apple Card) పేరుతో సొంత క్రెడిట్ కార్డ్ సిస్టమ్ ను యాపిల్ (Apple) భారత్ లో ప్రారంభించనుంది. భారత్ లోని ఫైనాన్షయల్ మార్కెట్ లో అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయని ఈ ఐ ఫోన్ (iPhone) తయారీ సంస్థ భావిస్తోంది. యాపిల్ కార్డ్ మార్కెటింగ్ కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తో యాపిల్ భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ఈ దిశగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాపిల్ ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ముంబైలో ఇటీవల తొలి యాపిల్ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ శశిధర్ జగదీశన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఆర్బీఐ తోనూ సంప్రదింపులు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భాగస్వామ్యంలో యాపిల్ కార్డును భారత్ లో లాంచ్ చేయడానికి సంబంధించిన చర్చలు ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తో పాటు యాపిల్ క్రెడిట్ కార్డు కార్యకలాపాలను భారత్ లో ప్రారంభించడానికి అవసరమైన నియమ నిబంధనలను తెలుసుకోవడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (RBI) కూడా యాపిల్ సంస్థ సంప్రదిస్తోంది. ఇతర కో -బ్రాండెడ్ కార్డ్స్ కు వర్తించే నియమ నిబంధనలే ఇక్కడా వర్తిస్తాయని ఆర్బీఐ అధికారులు యాపిల్ ప్రతినిధులకు వివరించినట్లు సమాచారం. యాపిల్ కు ఈ విషయంలో ప్రత్యేక వెసులుబాట్లు ఏవీ ఉండవని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యాపిల్ క్రెడిట్ కార్డ్ అమెరికా సహా పలు దేశాల్లో అందుబాటులో ఉంది. యూఎస్ లో ప్రీమియం క్రెడిట కార్డ్ కేటగిరీలో గోల్డ్ మ్యాన్ సాచ్స్ ,మాస్టర్ కార్డ్ భాగస్వామ్యంలో యాపిల్ కార్డును తీసుకువచ్చారు.