SRH vs RR: సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన రాజస్థాన్.. అదిరిపోయే విజయంతో బోణీ కొట్టిన సంజూ శాంసన్ టీమ్-rajasthan royals won by 72 runs against sunrisers hyderabad ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Srh Vs Rr: సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన రాజస్థాన్.. అదిరిపోయే విజయంతో బోణీ కొట్టిన సంజూ శాంసన్ టీమ్

SRH vs RR: సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన రాజస్థాన్.. అదిరిపోయే విజయంతో బోణీ కొట్టిన సంజూ శాంసన్ టీమ్

Maragani Govardhan HT Telugu
Apr 02, 2023 07:45 PM IST

SRH vs RR: ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చాహల్ 4 వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ను ఘోరంగా దెబ్బకొట్టాడు. దీంతో రాజస్థాన్ ఈ ఐపీఎల్‌ను విజయంతో బోణీ కొట్టింది.

సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ ఘనవిజయం
సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ ఘనవిజయం (AP)

SRH vs RR: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా ఓడిపోయింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 8 వికెట్లు నష్టపోయి 131 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా రాజస్థాన్ 72 పరుగుల తేడాతో భారీగా విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్లలో అబ్దుల్ సమద్ చేసిన 32 పరుగులే అత్యధిక స్కోరు. మిగిలిన వారంతా ఘోరంగా విఫలం కావడంతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి పాలైంది. రాజస్థాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ 4 వికెట్లతో విజృంభించగా ట్రెంట్ బౌల్డ్ 2 వికెట్లతో రాణించాడు.

204 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు శుభారంభమేమి దక్కలేదు. తొలి ఓవర్లో పరుగుల వరద ప్రారంభం కాకముందే ఓపెనర్ అభిషేక్ శర్మను(0) బౌల్ట్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్లో వన్డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠిని కూడాడకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో 0 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది సన్ రైజర్స్. అనంతరం క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్(13) సాయంతో మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ మరి నిదానంగా ఆడటంతో స్కోరు వేగం బాగా తగ్గింది. అప్పుడే రాజస్థాన్ విజయం ఖరారైపోయింది. రన్ రేట్ పెరగడం, పదే పదే వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ ఆత్మరక్షణ ధోరణిలో బ్యాటింగ్ చేసింది.

కాసేపటికే చాహల్‌ హ్యారీ బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ కాసేపటికే వాషింగ్టన్ సుందర్‌ను(1) జేసన్ హోల్డర్.. గ్లెన్ ఫిలిప్స్‌ను(8) అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. జోరుమీదున్న మయాంక్‌ను(27) కూడా చాహల్ వెనక్కి పంపాడు. ఇలాంటి సమయంలో అబ్దుల్ సమద్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. చివరి వరకు బ్యాటింగ్ చేసి 32 పరుగులతో హయ్యేస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ భువనేశ్వర్ కూమార్‌(6) కూడా చాహల్ బౌలింగ్ ఔటవ్వడంతో హైదరాబాద్ కష్టాల్లో పడింది.

చివరి ఓవర్లో అబ్దుల్ సమద్(32), ఉమ్రాన్ మాలిక్(19) బౌండరీలు కొట్టడంతో 23 పరుగుల వచ్చాయి. ఫలితంగా హైదరాబాద్ చివరకు 8 వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన రాజస్థాన్ రాయల్స్ 72 పరుగుల తేడాతో బ్యాటింగ్ చేసి ఈ ఐపీఎల్‌లో బోణి కొట్టింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లు సంజూ శాంసన్(55), జోస్ బట్లర్(54), యశస్వి జైస్వాల్(54) అర్ధ శతకాలతో చెలరేగి హైదరాబాద్ నుంచి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లలో ఫజాల్ హఖ్ ఫరూఖి, నటరాజన్ చెరో 2 వికెట్లు తీయగా.. ఉమ్రాన్ మాలిక్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

WhatsApp channel